
హైదరాబాద్, నవంబర్ 13 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్ విభజనపై అసంబద్ధ ప్రకటనలతో ప్రజలను గందరగో ళపరుస్తున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబా బునాయుడు మళ్లీ అదే వైఖరి ప్రదర్శించాడు. రాష్ట్ర విభజన కార్యక్ర మాన్ని కాంగ్రెస్ పార్టీ అపహాస్యం చేసిందని బాబు విమర్శించారు. కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని పెద్దఎత్తున నిరసనలు రావడంతో, నిరసన నుంచి ఎలా బయటపడాలో తెలియకనే అన్ని పార్టీలకు కేంద్రం లేఖ రాసిందన్నారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ నేతలు తెలుగుజాతిని అడుగడుగునా అవమానిస్తున్నారన్నారు. విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ తీరుపైన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగు జాతి భవిష్యత్తును కాంగ్రెసు పార్టీ దెబ్బతీస్తోందన్నారు. విభజనను అపహాస్యం చేస్తోందన్నారు. రాష్ట్రం విషయంలో కాంగ్రెసు నీతిమాలిన రాజకీయం చేస్తోందని, దానికి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. షిండేతో రహస్య సమావేశమేమిటో పీసీసీ అధ్యక్షుడు బొత్స చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు అభిప్రాయాలతో ఇద్దరు ప్రతనిధులు వెళ్లారు. 2014 జనవరి 1 నాటికి రాష్ట్రం ఏర్పడుతుందని ఒకాయన చెబుతున్నారు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు కృషి చేస్తామని మరొక కాంగ్రెస్ నేత చెబుతున్నారని విమర్శించారు. ఒక్కో పార్టీకి 20 నిమిషాలు కేటాయించి రాష్ట్ర విభజన ఎలా చేస్తారని ప్రశ్నించారు. అఖిలపక్షం పేరుతో ఏక పార్టీలను ఇంటర్వ్యూలు చేయడమేంటని నిలదీశారు. ఆడించేది కాంగ్రెస్ పార్టీ, ఆడేది వైకాపా, తెరాస అని ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ స్క్రిప్టుతోనే వైకాపా, తెరాస నాటకాలాడుతున్నాయన్నారు. సమన్యాయం చేయమనే టిడిపి మొదట్నుంచీ చెబుతోందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇరు ప్రాంతాల్లోని ఐకాసలు, ప్రజా సంఘాలను మంత్రుల బృందం పిలవకపోవడంలో అంత్యర్యమేమిటని ప్రశ్నించారు. రెండు మూడు నెలలకు పోయే ప్రధాని సీమాంధ్రకు ఏం న్యాయం చేస్తారని అన్నారు. భాగస్వామ్య పక్షాలను కూర్చోబెట్టి చర్చించకపోవడం సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కాదా అని పేర్కొన్నారు. ప్రజాకోర్టులో కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిలను నిలబెడతామన్నారు. విభజనపై ఏకపక్షమంటూ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాకే కేంద్రం మళ్లీ లేఖలు పంపించిందన్నారు. కాంగ్రెసు పార్టీ నుండి వెళ్లిన వారు జివోఎం భేటీలో రెండు వాదనలు వినిపించడమేమిటన్నారు. కాంగ్రెసు నాటకాలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. ఇరు ప్రాంత నేతలను అధిష్టానమే పంపించి, రెండు వాదనలు చెప్పించి నాటకాలాడుతోందన్నారు. ఢిల్లీ ఆదేశాలతోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జివోఎం భేటీకీ హాజరవుతోందన్నారు. విభజన హేతుబద్దంగా లేదని తాము మొదటి నుండి చెబుతున్నామన్నారు. విభజన అంశంపై కేంద్రం దగ్గర సరైన సమాచారం లేదని జివోఎం భేటీతో రుజువైందన్నారు. సమాచారం లేకుండా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని అభిప్రాయపడ్డారు. విభజనపై తీర్మానం చేసి, కేబినెట్ ఆమోదం పొందాక మళ్లీ కాంగ్రెసు పార్టీ నుండి దామోదర, వట్టి వసంత్ కుమార్ వెళ్లి అభిప్రాయం చెప్పడమేమిటన్నారు. తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో కేంద్ర ¬ంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే రహస్య మంతనాలేంటని ప్రశ్నించారు. విభజనపై ఏర్పాటు చేస్తున్న సమావేశాలు అంతా ప్రహసనం అన్నారు. కాంగ్రెసు అధిష్టానం చెప్పినట్లు వైయస్సార్ కాంగ్రెసు, తెరాసలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెసు రాజకీయ నాటకాలతో పార్టీలు, నాయకుల పైన ప్రజల్లో విశ్వాసం పోయిందని మండిపడ్డారు. తనకు కెసిఆర్‌లా మైండ్ గేమ్ ఆడే తెలివి లేదని ఎద్దేవా చేశారు. తాము అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ ఒకటే చెబుతున్నామన్నారు. సమన్యాయం చేసి విభజించాలన్నారు. రెండు ప్రాంతాల జెఏసిలను, ప్రతినిధులను పిలిచి మాట్లాడాలని తాము డిమాండ్ చేస్తున్నామని, దానిని ఎందుకు పెడ చెవిన పెట్టారన్నారు. ఆంటోని కమిటీ నివేదిక ఏమైందో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెసు నేతలు పగలు రిపోర్ట్ రాసి రాత్రి లీకులు ఇస్తారని, అదేమిటని అడిగితే తాము లీసులు ఇవ్వలేదంటున్నారు. రెండు మూడు నెలలకు పోయే ప్రధాని సీమాంధ్రకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు.
మింగలేక.. కక్కలేక (కిక్కర్) విభజన ఏకపక్షం : చంద్రబాబు




