Tuesday, 3 November 2026

పార్టీ నిర్ణయమే శిరోధార్యం : బొత్స


హైదరాబాద్‌, నవంబర్‌ 13 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో పార్టీ నిర్ణయ మే తనకు శిరోధార్యమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనా రాయణ అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్‌కు ద్వంద్వ వైఖరి లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ విధానాలకు లోబడే ఇరు ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను జివోఎంకు సమర్పించారని అన్నారు. అఖిలపక్ష భేటీలో భాగంగా మంత్రుల బృందం (జివోఎం) వద్ద కాంగ్రెసు పార్టీ వేర్వేరు అభిప్రాయాలు చెప్పడాన్ని బొత్స సత్యనారాయణ బుధవారం సమర్థించుకున్నారు. విభజన విషయంలో తమ పార్టీకి ద్వంద్వ వైఖరి లేదన్నారు. షిండేను తాను రహస్యంగా కలవలేదని చెప్పిన బొత్స రెండు వేర్వేరు పీసీసీల ఏర్పాటు గురించి తనకు తెలియదన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని గౌరవిస్తూనే ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలను చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీకి ముసాయిదా బిల్లు వచ్చాక కూడా ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలే చెబుతారని బొత్స పేర్కొన్నారు. కాంగ్రెసు పార్టీ వర్కింగ్‌ కమిటీ (సిడబ్ల్యూసి) నిర్ణయాన్ని గౌరవిస్తూనే తాము ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలను జివోఎంకు చెప్పామన్నారు. అందులో ద్వంద్వ వైఖరి ఏవిూ లేదని అభిప్రాయపడ్డారు.విభజన బిల్లు, రెండు పిసిసిలు ఎప్పుడు వస్తాయో తనకు తెలియదన్నారు. అసెంబ్లీకి ముసాయిదా బిల్లు వచ్చాక కూడా ఎమ్మెల్యేలు ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలే చెబుతారని తెలిపారు. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే పార్టీ తరఫున విప్‌ జారీ చేయబోమన్నారు. మంగళవారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెసు పార్టీ తరఫున వెళ్లిన ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విభజనకు అనుకూలంగా, మంత్రి వట్టి వసంత్‌ కుమార్‌ సమైక్యాంధ్రకు అనుకూలంగా అభిప్రాయాన్ని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *