Wednesday, 4 November 2026

సచిన్‌కు అరుదైన గౌరవం

ముంబై, నవంబర్‌ 14 (జనంసాక్షి) :
మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. సచిన్‌ భారత్‌ క్రికెట్‌కు అందించిన సేవలకు గానూ గుర్తింపుగా పోస్టల్‌ శాఖ ఆయనపై ప్రత్యేకంగా పోస్టల్‌ స్టాంప్‌ విడుదల చేసింది. వాంఖేడే వేదికగా కెరీర్‌లో చివరి టెస్ట్‌ ఆడుతోన్న సందర్భంగా కేంద్ర మంత్రి కపిల్‌ సిబాల్‌ ఈ స్టాంపులను విడుదల చేశారు. మిలింద్‌ దేవ్‌రా, శరద్‌ పవార్‌, రాజీవ్‌శుక్లా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 20 రూపాయలు విలువ కలిగిన పోస్టల్‌ స్టాంపులపై సచిన్‌ క్రికెట్‌ ఆడే చిత్రాలు ఉండే విధంగా ముద్రించారు. ప్రముఖ వ్యక్తులు జీవించి ఉన్న సమయంలో ఈ విధంగా పోస్టల్‌ స్టాంపులు రూపొందించిడం చాలా అరుదు. గతంలో మథర్‌ థెరీసా తర్వాత మళ్లీ సచిన్‌కే ఈ గౌరవం దక్కింది. సచిన్‌ చివరి టెస్ట్‌ చూసేందుకు అతని కుటుంబసభ్యులతో పాటు బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ఖాన్‌ ఇంకా పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *