ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, నవంబర్ 14 (జనంసాక్షి) :
ఇన్‌చార్జి డీజీపీ బి. ప్రసాద్‌రావును పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతకుముంతదు డీజీపీగా ఉన్న దినేశ్‌రెడ్డి పదవీ విరమణ చేసిన తర్వాత ప్రసాదరావు ఇన్‌చార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. డీజీపీ నియామకం కోసం యూపీఎస్సీ ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో జాబితా రూపొందించింది. డీజీపీ నియామకంలో సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారితో వివరాలతో రాష్ట్ర ప్రభుత్వం పంపే సిఫార్సులను యూపీఎస్సీ పరిశీలించి ముగ్గురు సీనియర్లలో ఒకరికి బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. పదవీకాలం, సత్ప్రవర్తన, అనుభవం తదితర అంశాలను ప్రామాణికంగా తీసుకుని డీజీపీని నియమించాల్సి ఉంది. దినేశ్‌రెడ్డి రిటైర్మెంట్ తర్వాత యూపీఎస్సీ ముగ్గురితో జాబితా రూపొందించగా, వారిలో ప్రసాద్‌రావువైపే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపింది.
పూర్తి స్థాయి డీజీపీగా ప్రసాద్‌రావు




