Wednesday, 4 November 2026

మీరు మడమ తిప్పినట్టు..

తెలంగాణపై మేం వెనక్కు వెళ్లలేం
సురవరం సుధాకర్‌రెడ్డి
జగన్‌కు ఢిల్లీలో చుక్కెదురు
న్యూఢిల్లీ, నవంబర్‌16 (జనంసాక్షి) :
మీరు మడమ తప్పినట్టు.. మాట తిప్పినట్టు మేం తెలంగాణ విషయంలో వెనక్కు తగ్గబోమని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డికి స్పష్టం చేశారు. శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్న జగన్‌ సుధాకర్‌రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉండాలని తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని నాయకులను జగన్‌ కోరారు. దాదాపు 45 నిమిషాలుగా వారి భేటీ సాగింది. ఈ మేరకు వారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఆయన వెంట పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నాయకులు కొణతాల రామకృష్ణ, వల్లభనేని బాలశౌరి, గట్టు రామచంద్రరావు, మైసూరారెడ్డి తదితరులు ఉన్నారు. అయితే సిపిఐ నుంచి జగన్‌కు నిరాశే ఎదురైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తాము తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కి తగ్గేది లేదని సురవరం సుధాకర్‌ రెడ్డి జగన్‌కు తేల్చి చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జాతీయ పార్టీల మద్దతు కూడగట్టడానికి ఢిల్లీ చేరుకున్న జగన్‌ శనివారం సురవరం సుధాకర్‌ రెడ్డిని కలిశారు. దాదాపు 45 నిమిషాల పాటు జగన్‌ సురవరంతో సమావేశమయ్యారు. సమావేశానంతరం సురవరం సుధాకర్‌ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని జగన్‌ తమను కోరినట్లు ఆయన తెలిపారు. ఆర్టికల్‌ 3ని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని జగన్‌ చెప్పారని, అయితే, అది దుర్వినియోగం కాకుండా తాము చూస్తామని చెప్పామని ఆయన అన్నారు. తమ నిర్ణయంలో పునరాలోచన లేదని, విభజన జరగాల్సిందేనని తాము జగన్‌తో చెప్పినట్లు ఆయన తెలిపారు. విభజించు, పాలించు సూక్తికి ఆంధప్రదేశ్‌ నాంది కాకూడదని, రాష్ట్రాన్ని విభజిస్తే దేశం ముక్కలవుతుందని జగన్‌ అన్నారని ఆయన చెప్పారు. అయితే, రాష్ట్రాన్ని విభజించడానికి ఇష్టం లేనివారే దేశం ముక్కలవుతుందనే వాదనను ముందుకు తెస్తున్నారని సురవరం అన్నారు. పలు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ముక్కలు కాని దేశం తెలంగాణ ఏర్పిడినప్పుడే అవుతుందా ఆయన సురవరం ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు విడిపోదలుచుకున్నప్పుడు దాన్ని ఆపాల్సిన అవసరం లేదని, సుదీర్ఘ ఉద్యమాల తర్వాతనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ముందుకు వచ్చిందని ఆయన అన్నారు. సీమాంధ్రకు న్యాయం చేసిన తర్వాతనే రాష్ట్రాన్ని విభజించాలనే వాదనను కూడా సురవరం కొట్టిపారేశారు. రాష్ట్ర విభజన వేగంగా జరగాలని, విభజన పక్రియతో పాటు- సీమాంధ్రకు న్యాయం చేసే పక్రియ జరగాలని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు దేశమంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. సీమాంధ్రకు న్యాయం జరగేలా తాము చూస్తామని జగన్‌తో చెప్పినట్లు ఆయన తెలిపారు. జగన్‌తో పొత్తులపై చర్చ జరగలేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణకు సంబంధించి మా వైఖరిలో పునరాలోచన లేదు. అయితే ఆర్టికల్‌ 3 దుర్వినియోగం కాకుండా నిరోధించేందుకు ఆలోచన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాం. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజలకు న్యాయం చేయడానికి మా పార్టీ నిలుస్తుంది. తెలంగాణ ఏర్పడినంత మాత్రాన ఇతర ప్రాంతాలకు అన్యాయం జరగకుండా ఉండేందుకు ఉద్యమిస్తాం. కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు న్యాయం జరిగిన తర్వాతే విభజన పక్రియ ముందుకు సాగాలి’ అని సురవరం చెప్పారు. విభజన విషయంలో రాష్ట్రంలోని వివిధ స్టేక్‌ ¬ల్డర్లను సప్రందించకుండా ముందుకువెళ్లడం తగదని గతంలోనే ప్రధానమంత్రికి లేఖ రాశామని, కోస్తాంధ్ర సమస్యల పరిష్కారం, విభజన రెండూ జరగాలని ఆయన తెలిపారు. పొత్తుల విషయంలో మాత్రం తమ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని, లౌకిక వాదంతో ఉండాలన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విధానాన్ని అభినందించామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *