ఈ ఎన్నికలు చారిత్రాత్మకం
ఆమ్ ఆద్మీ చీఫ్
న్యూఢిల్లీ, నవంబర్ 16 (జనంసాక్షి) :
ఢిల్లీ ముఖ్యమంత్రిపై పోటీకి ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజీవ్రాల్ నామినేషన్ వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికలు చారిత్రాత్మకమని ఆయన అన్నారు. ఇది ఒక చారిత్రక ఎన్నిక, నన్ను ముఖ్యమంత్రి చేయమని అడగడం లేదు. ఢిల్లీలో ప్రతి పౌరుడు ముఖ్యమంత్రిలా ఉండేలా చూసే ప్రభుత్వాన్ని తీసుకురండి. అని వ్యాఖ్యానించారు. 1998 నుంచి ఈ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న షీలాదీక్షిత్‌పై కేజీవ్రాల్ పోటీ చేయడంతో అంతటా ఆసక్తి నెలకొంది. కేజ్రీవాల్ నామినేషన్‌తో ఢిల్లీ ఎన్నికలు రసకందాయంలో పడ్డాయి. 15 ఏళ్లుగా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న సిఎం షీలాను ఆయన ఢీకొనబోతున్నారు. శనివారం న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేశారు. డిసెంబర్ 4న జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలల్లో నామినేషన్ సమర్పించేందుకు శనివారం ఆఖరి తేదీ కావడంతో వివిధ రాజకీయ పార్టీ నాయకులు నామినేషన్లు సమర్పించారు. న్యూఢిల్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ గత 15 ఏళ్లుగా ఈ స్థానంలో పోటీచేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నేత విజయేంద్ర గుప్తా కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. నామినేషన్ దాఖలు చేసేందుకు తల్లిదండ్రులతో జామ్‌నగర్‌లోని తన నివాసం నుంచి బయలుదేరి వెళ్లారు.
నామినేషన్ వేసిన కేజ్రీవాల్




