నా ధ్యాస.. శ్వాస.. ప్రాణం.. క్రికెటే…
రిటైర్మెంట్ తర్వాత మొదటి మీడియా సమావేశంలో సచిన్
ముంబై, నవంబర్ 17 (జనంసాక్షి) :
ఆటను వీడినా అనుబంధం కొనసాగుతుందని, తన ధ్యాస.. శ్వాస.. ప్రాణం.. క్రికెట్టేనని సచిన్ టెండూల్కర్ అన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ఆదివారం ఆయన ముంబైలో మీడియాతో మాట్లాడారు. 40 ఏళ్ల తన జీవితంలో 30 ఏళ్లు క్రికెట్‌తోనే ముడిపడి ఉందని సచిన్ టెండూల్కర్ అన్నారు. ఈ సందర్భంగా మీడియా తన క్రికెట్ అనుభవాలను పంచుకున్నాడు. క్రికెట్ తన ప్రాణం, శ్వాస అని 24 గజాల పిచ్ తనకు దేవాలయంతో సమానమని ఉద్వేగంగా చెప్పాడు. క్రికెట్‌తో తన అనుబంధం ఇక ముందుకూడా కొనసాగుతుందని వెల్లడించారు. 24 ఏళ్ల తన కెరీర్‌లో ఏన్నో సవాళ్ల్లు ఎదురయ్యాయని దేశానికి 24 ఏళ్లపాటు సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తన శరీరం ఇక భారం మోసేందుకు అనువుగా లేదని తెలిసిందని, క్రికెట్ నుంచి తప్పుకొడానికి ఇదే సరైన సమయమని భావించి తప్పుకున్నట్లు తెలిపాడు. ఇంగ్లాండ్‌పై సాధించిన తొలి శతకం ఓ మధురానుభూతిగా ఆఖరి మ్యాచ్‌ను చూడాల్సిందిగా అమ్మను కోరారని తెలిపారు. సాధ్యమైతే ఆఖరి మ్యాచ్ ముంబయిలో జరిగేలా చూడాలని బీసీసీఐ కోరినట్లు వెల్లడించారు. వాంఖడే స్టేడియంలోని పిచ్‌ను ముద్దాడినప్పుడు ఉద్వేగానికి గురైనట్లు చెప్పాడు. భారతరత్న పురస్కారం అందుకోబోతున్న సీఎన్‌ఆర్ రావుకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
ఆటవీడినా అనుబంధం కొనసాగిస్తా




