న్యూఢిల్లీ, నవంబర్ 17 (జనంసాక్షి) :
ఢిల్లీ ముఖచిత్రాన్ని మార్చేసిందే ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ముఖ్యమంత్రిగా షీలాదీక్షిత్ ఢిల్లీ నగర ముఖచిత్రాన్నే మార్చేశారని ఆయన కొనియాడారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ తాము సాధారణపౌరులను సాధికారులను చేయడంపై దృష్టిపెడుతున్నారు. అనుభవజ్ఞురాలైన షీలాదీక్షిత్ చేతిలోనే ఢిల్లీ మరింత ప్రగతి సాధించడలదన్నారు. ఢిల్లీలో అన్ని మతాలవారిని సమానంగా చూస్తామని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి కుంటుపడింది, అవినీతి పెరిగిపోయిందని ఆమ్‌ఆద్మీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఆయన ప్రతిస్పందించారు. దేశాన్ని, దేశ రాజధానిని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లింది కాంగ్రెస్ పార్టీయేనని, ప్రజలను అన్ని విధాలుగా ఆదుకునే పార్టీ కూడా కాంగ్రెస్సేనని ఆయన పేర్కొన్నారు.
ఢిల్లీ ముఖచిత్రం మార్చింది షీలానే : రాహుల్




