Wednesday, 4 November 2026

ఛత్తీస్‌గఢ్‌లో పోలింగ్‌కు సర్వం సిద్ధం

రాయ్‌పూర్‌, నవంబర్‌ 18 (జనంసాక్షి) :
ఛత్తీస్‌గఢ్‌ తుది విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. మంగళవారం రాష్ట్రంలోని 72 నియోజకవర్గాల్లో పోలింగ్‌ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. పోలీసుల కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర కమిషనర్‌ సునీల్‌ కుజర్‌ తెలిపారు. సుమారు లక్ష మంది భద్రతా సిబ్బందిని 72 నియోజకవర్గాల పరిధిలో మోహరించినట్లు చెప్పారు. మంగళవారం జరిగే ఎన్నికల్లో శాసనసభ స్పీకర్‌తో పాటు తొమ్మిది మంది మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. దర్బా మారణకాండ నుంచి బయటపడిన మాజీ ముఖ్యమంత్రి అజిత్‌సింగ్‌ సతీమణి రేణ పోటీలో ఉన్నారు. 72 నియోజకవర్గాలో 843 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 1,39,75,470 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *