న్యూఢిల్లీ, నవంబర్ 19 (జనంసాక్షి) :
ఇందిరాగాంధీ 96 జయంతి సందర్భంగా ఢిల్లీలోని శక్తిస్థల్‌లో పలువురు ప్రముఖులు ఆమెకు నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, స్పీకర్ మీరాకుమార్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. త్రివర్ణ పతాకం రంగుల్లో బెలూన్‌లను ఎగరవేశాక, రికార్డు చేసిన ఇందిరాగాంధీ ప్రసంగాన్ని వినిపించారు. ఈ కార్యక్రమంలో సుశీల్ కుమార్ షిండే, సల్మాన్ ఖుర్షీద్, గలాంనబీ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమె సమాధిని సందర్శించే సమయంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తడబడ్డారు. ఇందిర సమాధి వైపు కాకుండా వెనక్కి తిరిగి దండం పెట్టారు. ఆ తర్వాత నాలిక్కరుచుకుని తిరిగి సమాధి వైపు తిరిగి నమస్కారం చేశారు.
శక్తిస్థల్ వద్ద ప్రముఖుల నివాళి




