Tuesday, 3 November 2026

తొలి మహిళా బ్యాంక్‌ ప్రారంభం

మహిళా సాధికారతే లక్ష్యం : మన్మోహన్‌, సోనియా
ముంబయి, నవంబర్‌ 19 (జనంసాక్షి) :
దేశంలోనే మొట్టమొదటి భారతీయ మహిళా బ్యాంకును మంగళవారం దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రారంభించారు. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళా బ్యాంకును ప్రారంభించారు. ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ బ్యాంకు తొలి శాఖను ముంబయిలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ , ఆర్థిక మంత్రి చిదంబరం మహారాష్ట్ర గవర్నర్‌ శంకర్‌ నారాయణన్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ పాల్గొన్నారు. ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా 7 మహిళా బ్యాంకు శాఖలు పనిచేయడం ప్రారంభిస్తున్నాయి. వీటిలో అధికశాతం సిబ్బంది కూడా మహిళలే ఉంటారు. 2014 మార్చి 31లోగా ఈ బ్యాంకుకు 25 శాఖలను ఏర్పాటు చేయనున్నారు. ఉషా అనంత సుబ్రమణ్యన్‌ భారతీయ మహిళా బ్యాంకు చైర్‌పర్సన్‌గా నియమితులైన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *