అవి చూపి అభివృద్ధి అంటారా
భాజపాపై రాహుల్ ఫైర్
భోపాల్, నవంబర్ 20 (జనంసాక్షి) :
కార్లలో షికార్లు చేసేందుకు తప్ప సామాన్యులకు పెద్ద పెద్ద రోడ్లతో ప్రయోజనం ఉండబోదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. తాము అధికారంలోకి వస్తే మధ్యప్రదేశ్‌లో రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దుతామని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కుక్షిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. రోడ్లతో పేదలకు ప్రత్యేకంగా ఒరిగేదంటూ ఏమీ లేదని అన్నారు. అభివృద్ధి అంటే ఆరోగ్య, విద్యారంగాలకు సంబంధించిందని అన్నారు. రైతులు చెమట చిందించి పొలంలో కష్టపడతారని, డబ్బున్న వాళ్లు మాత్రమే రోడ్లపై కార్లలో ప్రయాణిస్తుంటారని అన్నారు. ఒక రైతు పొలంలో కష్టపడి పనిచేస్తున్నప్పుడు అతని పొలం మీదుగా విమానం వెళ్తే ఎప్పటికైనా తన కొడుకు విమానంలో ప్రయాణించే స్థాయికి ఎదగాలని కోరుకుంటాడని రాహుల్ అన్నారు. రాజస్థాన్‌లో తమ ప్రభుత్వం పేదలకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తుందని ఈ సందర్భంగా ఆయన ఓటర్లకు వివరించారు.
కార్లలో షికారుకే రోడ్లు




