వారం రోజుల్లో కేబినెట్‌ ముందుకు టీ ముసాయిదా

వెనువెంటనే రాష్ట్రపతికి, అసెంబ్లీకి.. : షిండే
న్యూఢిల్లీ, నవంబర్‌ 20 (జనంసాక్షి) :
వారం రోజుల్లో కేబినెట్‌ ముందుకు తెలంగాణ ముసాయిదా రానుంది. ఈమేరకు విభజన ముసాయిదా నివేదిక రూపకల్పనలో జీవోఎం నిమగ్నమైంది. ¬ం మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి జైరాం రమేశ్‌ సమావేశ మయ్యారు. గురువారం ఉదయం 11.30గంటలకు జీవోఎం సమావేశమై ముసాయిదా నివేదికను ఖరారు చేయనుంది. కేంద్ర ¬ం శాఖాధికారులతో కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ భేటీ ముగిసింది. దీంతో తెలంగాణ ఏర్పాటు దిశగా కేంద్రం వేగంగా అడుగులు వేస్తొంది. విభజనపై కేంద్ర ¬ంశాఖాధికారులు ఓ ముసాయిదాను తయారు చేసినట్టు సమాచారం. కాగా గురువారం జరుగునున్న జీవోఎం ముందుకు నివేదిక తుదిరూపం రానుంది. అధికారులతో జీవోఎం సమావేశం అనంతరం షిండే మాట్లాడుతూ వచ్చే వారమే కేంద్ర మంత్రివర్గం ముందుకు ముసాయిదా నివేదిక వస్తుందని తెలిపారు. గురువారం మరోమారు ఉదయం 11.30 గంటలకు జీవోఎం తిరిగి సమావేశం కానుంది. ఈ సమావేశంలో విభజనపై ముసాయిదా ఖరారు చేయనుంది. తాము ఓ పెద్ద నిర్ణయం తీసుకుంటున్నామని, కేబినేట్‌ బేటీపై తొందరేముందని కేంద్ర ¬ంశాఖ మంత్రి, మంత్రుల బృందం (జివోఎం) సభ్యుడు సుశీల్‌ కుమార్‌ షిండే బుధవారం వ్యాఖ్యానించారు. గురువారం జరగబోయే కేబినెట్‌ సమావేశంలో జివోఎం నివేదిక రాకపోవచ్చునని చెప్పారు. అలాగే రేపటిదే జివోఎం చివరి సమావేశం కాకపోవచ్చునన్నారు. ఇంకా ఒకటి రెండుసార్లు సమావేశం కావాల్సి ఉంటుందేమోనని అభిప్రాయపడ్డారు. అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని విధాలా ఆలోచించాలన్నారు.