Tuesday, 3 November 2026

పెను తుపానుగా మారనున్న హెలెన్‌

హైదరాబాద్‌, నవంబర్‌ 20 (జనంసాక్షి) :
హెలెన్‌ తుపాను పశ్చిమ మద్య బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతుంది. ఇది మరింతగా బలపడి రాగల 24 గంటల్లో పెనుతుఫానుగా మారే అవకాశం ఉందని తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. చెన్నై తూర్పు ఈశాన్య దిశలో 470 కిలోమీటర్లు, కావలికి తూర్పు దిశలో 420 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం మరింత బలపడి రాగల 6 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. చేపటవేటకు వెల్లవద్దని మత్స్యకారులకు మెచ్చరించారు. రెండో నెంబర్‌ ప్రమాద హెచ్చరిక చేశారు. ప్రస్తుతం ఇది కావలికి 400 కిలోవిూటర్ల దూరంలో కేంద్రీకృతం అయ్యింది. దీని ప్రభావంతో విపరీతమైన గాలులు, వర్షం కురుస్తుందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తుపాను సైతం మరింత బలపడి మరో 24గంటల్లో పెను తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తుపానుకు బంగ్లాదేశ్‌ సూచించిన హెలెన్‌ అనే పేరును ఖరారు చేసారు. ఇది ప్రస్తుతం చెన్నైకి తూర్పు-ఈశాన్య దిశలో 460 కిలోవిూటర్లు, కావలికి 430 కిలోమీటర్లు, మచిలీపట్నానికి తూర్పు-ఆగ్నేయ దిశలో 330 కిలోవిూటర్లు, విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయ దిశలో 310 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా పశ్చిమ వాయువ్యదిశగా పయనిస్తోంది. తుపాను చెన్నై-ఒంగోలు మధ్య కావలి సవిూపంలో రేపు రాత్రికి తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల ఈరాత్రి నుంచి కోస్తాంధ్రలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 55 నుంచి 75 కిలోవిూటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో… గాలుల వేగం 100 నుంచి 110 కిలోవిూటర్ల వేగానికి చేరుకునే అవకాశం ఉంది. సముద్రంలో చేపలవేటను అధికారులు నిషేధించారు. రాష్ట్రంలోని అన్ని ఓడరేవుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో ఇంటి పైకప్పులు ఎగిరిపోవటం, భారీ వృక్షాలు, టెలిఫోన్‌, విద్యుత్తు స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉంది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో నష్ట తీవ్రతను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామని విపత్తు నిర్వహణ కమిషనర్‌ పార్థసారథి తెలిపారు. నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. నెల్లూరు జిల్లాలో 52, ప్రకాశం జిల్లాలో 11 మండలాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించామని ఆయన తెలిపారు. తుపాను ముప్పు పొంచివున్న నేపథ్యంలో సచివాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు: 040-23456005, 23451043. ఇదిలావుంటే తుపాను శ్రీహరికోట- ఒంగోలు మధ్య కావలికి అతి సవిూపంలో తీరం దాటే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను తీరం దాటే సమయంలో తీర ప్రాంతాల్లో 1.5 నుంచి 4 విూటర్ల ఎత్తున రాకాసి అలలు ఎగసిపడే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల తీర ప్రాంతాల్లో భారీ అలలు ఎగసిపడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. సమాచార, రవాణా వ్యవస్థకు అంతరాయం కలిగే అవకాశం ఉందని తెలిపారు. మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో మూడో నంబరు, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *