Tuesday, 3 November 2026

గయాలో ముగ్గురు మావోయిస్టు అగ్రనేతల అరెస్టు

భారీగా ఆయుధాలు స్వాధీనం
గయా, నవంబర్‌ 21 (జనంసాక్షి) :
బీహార్‌లోని గయాలో ముగ్గురు మావోయిస్టు అగ్రనేతలను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం గయా జిల్లాలోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంలో పోలీసులు, ఎస్జీఎఫ్‌ దళాలు మూకుమ్మడి దాడులు నిర్వహించి ముగ్గురు మావోయిస్టు అగ్రనేతలను అరెస్టు చేశాయి. వారి నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 5వేల తుపాకీ గుండ్లు, 65 గ్రెనేడ్లు, 12 తుపాకులు, శక్తివంతమైన పేలుడు పదార్థాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీహార్‌లో మావోయిస్టు పార్టీకి ఇది వరుసగా రెండో ఎదురుదెబ్బ. వారం రోజుల క్రితం జామయి జిల్లాలోని అటవీప్రాంతంలో జరిపిన తనిఖీల్లోనూ పోలీసులు పెద్ద ఎత్తున మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈసారి ముగ్గురు అగ్రనేతలను అరెస్టు చేయడం ద్వారా పోలీసులు తనిఖీలను మరింత ముమ్మరం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *