యూపీఏ చైర్‌పర్సన్ సోనియా
భోపాల్, నవంబర్ 21 (జనంసాక్షి) :
అవినీతి పరులందరినీ భారతీయ జనతా పార్టీ చేరదీసిందని యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ఆరోపించారు. గురువారం మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో ఆమె మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి రాజ్యమేలుతోందని ఆమె అన్నారు. అవినీతి వ్యతిరేకంగా తమ పార్టీ రాజీలేని పోరాటం చేస్తోందని తెలిపారు. భవిష్యత్‌లోనూ ఇలాగే వ్యవహరిస్తామని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని జహుబా జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్తేజ పరిచారు. అవినీతికి పాల్పడిన వారిందరిపై విచారణకు తమ ప్రభుత్వం ఆదేశించిందని, నేరం రుజువైన వారికి శిక్ష పడి జైలుకు కూడా వెళ్లారన్నారు. అదే సమయంలో బీజేపీ మాత్రం అవినీతి పరులపై ఉదాసీనంగా వ్యవహరిస్తోందని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతిపరుల రాజ్యం సాగుతుందన్నారు.
అవినీతిపరులను భాజపా చేరదీసింది




