న్యూఢిల్లీ, నవంబర్ 22 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్ విభజనకు అడ్డంపడుతున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని సమర్థిస్తూ వ్యాఖ్యలు చేసినందుకు రేణుకాచౌదరిని అధిష్టానం ఏఐసీసీ అధికార ప్రతినిధి పదవినుంచి వెలివేసింది. ఈమేరకు పార్టీ మీడియా సెల్ ఒక ప్రకటన విడుదల చేసింది. మీడియా సంస్థలతో సమన్వయం చేయడంలో ఆమె పూర్తిగా విఫలమైనట్టు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అంచనాకు వచ్చిన తర్వాతే రేణుకపై వేటు వేసినట్లుగా తెలుస్తోంది. అలాగే వివిధ చానెళ్లలో చర్చలకు వెళ్లే నేతల జాబితాలో నుంచి ఆమె పేరు తొలగించినట్లుగా మీడియా సెల్ ధ్రువీకరించింది. ఆమె ఖమ్మం నుంచి 2004లో ఎంపీగా గెలుపొందగా, 2009లో ఓడిపోయారు. తర్వాత పార్టీ ఆమెకు రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం కల్పించింది. అత్యంత సున్నితమైన తెలంగాణ అంశంలో ఇక్కడ ప్రజల ఆకాంక్షల మేరకు కాకుండా తెలంగాణకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న సీఎం కిరణ్ చర్యలను పలుమార్లు సమర్థించింది. ఈనేపథ్యంలోనే ఆమెను పదవి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.
కిరణ్ తోకపట్టినందుకు ఏఐసీసీ ప్రతినిధిగా రేణుక వెలి




