న్యూఢిల్లీ, నవంబర్ 22 (జనంసాక్షి) :
ఓటుకు నోటు కేసులో సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అమర్‌సింగ్, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ వ్యక్తిగత కార్యదర్శి సుధీర్ణ కులకర్ణి నిర్దోషులని న్యాయస్థానం ప్రకటించింది. వీరితో పాటు బీజేపీ ఎంపీలు అశోక్‌అర్గల్, పఘన్‌సింగ్‌కులస్తే, మాజీ ఎంపీ మహబీర్‌సింగ్ భాగోరా, బీజేపీ కార్యకర్త సోహాలీ హిందుస్థానీలను ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషులుగా పేర్కొంది. ఈమేరకు న్యాయమూర్తి నరోత్తమ్ కౌశల్ వారిని నిర్దోషులుగా ప్రకటించారు. అమెరికాతో అణు ఒప్పందం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ 2008లో అప్పటి యూపీఏ భాగస్వామ్య పక్షాలైన వామపక్షపార్టీలు మద్దతు ఉపసంహరించుకోవడంతో మన్మోహన్‌సింగ్ సర్కారు అదే ఏడాది జులై 22న లోక్‌సభలో విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నారు. ఈ సమయంలో ముగ్గురు బీజేపీ ఎంపీలు తమను ప్రలోభ పెట్టడానికి పెద్ద ఎత్తున డబ్బు ఎరగా చూపారని లోక్‌సభలో డబ్బుల మూటలు కుమ్మరించడం సంచలనం సృష్టించింది. దీని వెనుక అమర్‌సింగ్, కులకర్ణి ఉన్నారని వారిపై 2011 ఆగస్టులో కేసు నమోదు చేశారు. అప్పటి ఎంపీలు అర్గల్, కులస్తే, భాగోరాల వాంగ్మూలాల రికార్డింగ్ కోసం టీవీ చానెళ్ల ప్రతినిధులను కులకర్ణి వారికి పరిచయం చేశాడు. అలాగే అమర్‌సింగ్ అవినీతికి పాల్పడ్డట్టు ఆధారాలు లభించలేదని కోర్టు అభిప్రాయ పడింది.
ఓటుకు నోటు కేసులో అమర్‌సింగ్, కులకర్ణి నిర్దోషులు




