చెన్నై, నవంబర్ 22 (జనంసాక్షి) :
ప్రపంచ చెస్ చాంపియన్‌గా నార్వే యువ సంచలనం మాగ్నోస్ కార్ల్‌సన్ అవతరించాడు. చెన్నైలో జరుగుతున్న ఫిడే అంతర్జాతీయ చెస్ చాంపియన్‌షిప్ పోటీల పదో గేమ్‌ను డ్రాగా ముగించడం ద్వారా ఆయన విశ్వవిజేత అయ్యాడు. 12 గేమ్‌ల వరల్డ్ సిరీస్‌లో రెండు గేమ్‌లు మిగిలుండగానే కార్ల్‌సన్ విజేత అయ్యాడు. కార్ల్‌సన్ మూడు గేముల్లో విజయం, ఏడు డ్రాల ద్వారా 6.5 పాయింట్లు రాబట్టుకున్నాడు. సొంతగడ్డపై చాంపియన్‌షిప్ కోసం తలపడ్డ డిఫెండింగ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. పది గేముల్లో ఒక్కటి కూడా ఆయన నెగ్గలేదు. ఏడు గేమ్‌లను డ్రాగా ముగించడం ద్వారా 3.5 పాయింట్లు మాత్రమే సాధించగలిగాడు.
ప్రపంచ చెస్ చాంపియన్ కార్ల్‌సన్




