Tuesday, 3 November 2026

తరుణ్‌ తేజ్‌పాల్‌ను ఎప్పుడైనా ప్రశ్నించే అవకాశం

న్యూఢిల్లీ, నవంబర్‌ 24 (జనంసాక్షి) :
తరుణ్‌ తేజ్‌పాల్‌ను ఎప్పుడైన ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమా చారం. తెహెల్కా ఎ డిటర్‌ తరుణ్‌ తేజ్‌ పాల్‌ తనపై లైంగిక వేధింపులకు పాల్ప డినట్లుగా ఆరోపిం చిన తెహెల్కా మ హిళా జర్నలిస్టు మాట్లాడిన ముగ్గురు సాక్షుల స్టేట్‌మెంట్లను గోవా పోలీసులు రికార్డు చేసుకోవడం ప్రారంభించారు. 15 రోజుల క్రితం గోవాలోని ఒక హోటల్‌లో లైంగిక వేధింపు జరిగిన వెంటనే బాధితురాలు తన సహచరులైన ఈ ముగ్గురితో మాట్లాడింది. తెహెల్కా మేనేజింగ్‌ ఎడిటర్‌ సోమా చౌదరికి పంపించిన ఈమెయిల్‌ ఫిర్యాదు కాపీలను ఆమె వీరికి పంపినట్లు సమాచారం. మహిళౄ జర్నలిస్టు తన ఫిర్యాదులో తన ముగ్గురు సహచరుల పేర్లను కూడా ప్రస్తావించినట్లు అలాగే సంఘటనకు సంబంధించిన వాస్తవాలను చౌదరి వారి నుంచి పొందవచ్చని పేర్కొనట్లు తెలిసింది. పోలీసులు తేజ్‌పాల్‌ను కూడా ప్రశ్నించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించారు. కాగా తనను లేదా తన క్లయింట్‌ను పోలీసులు ఇంకా సంప్రదించలేదని తేజ్‌పాల్‌ తరపు న్యాయవాది తెలిపారు. తేజ్‌పాల్‌ను అరెస్ట్‌ చేసే అవకాశం లేకపోలేదు. కాగా గోవా పోలీసులకు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం చౌదరిని ఎనిమిది గంటలకు పైగా ప్రశ్నించింది. శనివారం ఇక్కడకు చేరుకున్న డిఎస్పీ సమీ తవరేన్‌ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల గోవా పోలీసుల బృందం గ్రేటర్‌ కైలాష్‌ పార్ట్‌ 2లో విలాసవంతమైన దక్షిణ ఢిల్లీలో మేగజైన్‌ కార్యాలయానికి చేరుకుని చౌదరిని , కొద్దిమంది తెహెల్కా ఉద్యోగులను ప్రశ్నించారు. అనంతరం కేసులో దర్యాప్తు అధికారిణి సునీతా సావంత్‌తో కూడిన గోవా పోలీసుల బృందం చౌదరి, ఇతర తెహెల్కా ఉద్యోగుల స్టేట్‌మెంట్లను కూడా రికార్డు చేసుకున్నారని వారు తెలిపారు. గోవా పోలీసులు కోరిన అన్ని పత్రాలను చౌదరి ఇచ్చారని దర్యాప్తును ఆమె సహకరిస్తారని తెహెల్కా మేగజైన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది. ఈ వ్యవహారం ఆమెకు తొలిసారిగా ఎప్పుడు తెలిసింది, సంఘటనల పరిణామ క్రమం గురించి గోవా పోలీసులు చౌదరిని ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించారు. చౌదర, మహిళా జర్నలిస్టు, తేజ్‌పాల్‌ మధ్య ఈ మెయిల్స్‌ను పోలీసులు సేకరించారు. అంతేకాక చౌదరి మొబైల్‌ఫోన్‌, ట్యాబ్‌లెట్‌ ఫోన్‌, ల్యాప్‌టాప్‌లను కూడా పోలీసులు పరిశీలించినట్లు వారు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *