Tuesday, 3 November 2026

బెంగళూరులో రాజధానికి తప్పిన పెనుముప్పు

బెంగుళూరు, నవంబర్‌ 24 (జనంసాక్షి)
బెంగుళూరు నుంచి ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఆదివారం నగరంలోని సిటీ రైల్వే స్టేషన్‌ వద్ద రాజధాని ఎక్స్‌ప్రెస్‌ అకస్మాత్తుగా పట్టాలు తప్పింది. ఉదయం ప్రయాణికులు లేని సమయంలో వెనుకకు తీసుకుంటుండగా వెనుకవైపున గల రెండు భోగీలు పట్టాలు తప్పాయి. ఒక బోగీ అక్కడే బోల్తా పడగా మరో బోగి సమీపంలోని గోడను ఢీకొని ఆగిపోయింది. అయితే ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంప రైల్వే ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు పరిశీలన జరుపుతున్నారు. కారణాలను అన్వేషిస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *