Tuesday, 3 November 2026

ఎంపీ, మిజోరాంలో భారీ పోలింగ్‌

మధ్యప్రదేశ్‌లో 70 శాతం
మిజోరాంలో 80 శాతం నమోదు
మధ్యప్రదేశ్‌, మిజోలలో
పోలింగ్‌ ప్రశాంతం
న్యూఢిల్లీ, నవంబర్‌ 25 (జనంసాక్షి) :
మధ్యప్రదేశ్‌, మిజోరం రాష్ట్రాల అసెంబ్లీకి నిర్వహించిన పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యప్రదేశ్‌లోని 230 నియోజకవర్గాల్లోనూ, మిజోరంలోని 40 అసెంబ్లీ నియోజక వర్గాల్లోనూ పోలింగ్‌ సోమవారం ఉదయం ఆరంభమైంది. మధ్యాహ్నం 4 గంటల వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్‌లోని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలైన బైహర్‌, పారస్వద, లాంజిహి నియోజకవర్గాల్లో సోమవారం ఉదయం 7 గంటల నుంచి ఆరంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. మిగిలిన నియోజకవర్గాల్లో ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. మధ్యప్రదేశ్‌లోని 51 జిల్లాల్లో 53,896 పోలింగ్‌ బూతులలో పోలింగ్‌ జరిగింది. మొత్తం 2,583మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ తన నియోజకవర్గమైన బుద్నిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మిజోరంలో..
మిజోరంలోని 40 నియోజకవర్గాల్లో సోమవారం ఉదయం పోలింగ్‌ ఆరంభమైంది. మొత్తం 142మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ముఖ్యమంత్రి లాల్‌తన్‌వాలా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 1126 పోలింగ్‌ బూతులలో పోలింగ్‌ నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *