Tuesday, 3 November 2026

పేదరిక నిర్మూలన కాంగ్రెస్‌కే సాధ్యం : రాహుల్‌

అజ్మీర్‌, నవంబర్‌ 25 (జనంసాక్షి) :
దేశంలో పేదరిక నిర్మూలన కాంగ్రెస్‌తోనే సాధ్యమని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం అజ్మీర్‌లో జరిగిన బహిరంగసభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజల సేవలో ఉండే కాంగ్రెస్‌ను తిరిగి ఆదరించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో కాంగ్రెస్‌ పార్టీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని వివరించారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తమ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. దేశంలో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న మతతత్వశక్తుల పట్ల ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తోందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *