Tuesday, 3 November 2026

యూటీ చేయకుండానే సీమాంధ్రులకు రక్షణ

జైపాల్‌ రెడ్డి
న్యూఢిల్లీ, నవంబర్‌ 26 (జనంసాక్షి) :
హైదరాబాద్‌ను కేంద్ర పాలితప్రాంతం చేయకుండానే ఇక్కడ నివసించే సీమాంధ్రులకు రక్షణ కల్పించే అంశంపై కేంద్ర హోంశాఖకు న్యాయపరమైన సలహాలు ఇచ్చామని కేంద్ర మంత్రి ఎస్‌. జైపాల్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ను యూటీ చేయడానికి వంద శాతం వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటుపై న్యాయపరమైన అంశాల గురించి మంగళవారం షిండేతో చర్చించినట్లు తెలిపారు. రాయల తెలంగాణపై తమ ప్రాంత నేతలతో మాట్లాడి చెప్తానని అన్నారు. డిసెంబర్‌ 20 కల్లా తెలంగాణ ప్రక్రియ పూర్తవుతుందని ఆయన అన్నారు. కొద్ది రోజుల్లోనే అసెంబ్లీకి బిల్లు వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చేపార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ముగిసేలోగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అవకాశముందని జైపాల్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో స్థిరపడిన సీమాంధ్రులు భద్రత విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వారు ఇప్పట్లాగే తమ జీవనం కొనసాగించవచ్చని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *