Tuesday, 3 November 2026

తరుణ్‌ తేజ్‌పాల్‌కు సమన్లు

ఏ క్షణాన్నైనా అరెస్టు చేసే అవకాశం
తరుణ్‌ తేజ్‌పాల్‌కు సమన్లు జారీ
గోవా/న్యూఢిల్లీ, నవంబర్‌ 27 (జనంసాక్షి) :
తెహల్కా ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌కు పోలీసులు సమన్లు జారీ చేశారు. గోవా పోలీసుల ఎదుట హాజరుకావాలని సమన్లలో పేర్కొంది. విచారణ నిమిత్తం గురువారం మధ్యాహ్నం 3గంటలకు దర్యాప్తు బృందం ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. మరోవైపు తేజ్‌పాల్‌ ముందస్తు బెయిల్‌ దరఖాస్తుపై పత్రికలో పనిచేస్తున్న ఓ మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మహిళా జర్నలిస్ట్‌ను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహెల్కా ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌ను అరెస్టు తప్పకపోవచ్చని గోవా సీఎం మనోహర్‌ పారీకర్‌ స్పష్టం చేశారు. కేసులో జోక్యం చేసుకునేంత సమయం తనకు లేదని ఆయన అన్నారు. బాధితురాలికి న్యాయం చేయడానికి తాము అన్ని విధాల కృషి చేస్తామని పారీకర్‌ తేల్చిచెప్పారు. కేసు త్వరితగతిన పూర్తి చేసేందుకు పాస్ట్‌ ట్రాక్‌ కోర్టును ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు తరుణ్‌ తేజ్‌పాల్‌ను మంగళవారం గోవా పోలీసులు ఇమ్మిగ్రేషన్‌ చెక్‌పోస్ట్‌ అలర్ట్‌ను జారీ చేశారు. తేజ్‌పాల్‌ దేశం విడిచి వెళ్ల కుండా అప్రమత్తంగా ఉండాలని అన్ని విమానాశ్రయాలు. నౌకాశ్రయాలకు సమాచారం ఇచ్చారు. నిందితుడు దేశం విడిచివెళ్లే యత్నాలు చేయకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నామని డీఐజీ ఓపీ మిశ్రా వెల్లడించారు. బాధితురాలు దర్యాప్తు అధికారులకు వాంగ్మూలం ఇచ్చారని, అయితే ఆమె చెప్పే విషయాలను వెల్లడించలేనని తెలిపారు. దర్యాప్తులో రాజకీయ జోక్యం, ఒత్తిడి లేవన్నారు. మరోవైపు, తేజ్‌పాల్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిన్న నిరాకరించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *