Monday, 2 November 2026

తెహెల్కా మేనేజింగ్‌ ఎడిటర్‌ రాజీనామా

న్యూఢిల్లీ, నవంబర్‌ 28 (జనంసాక్షి) :
తెహెల్కా మేనేజింగ్‌ ఎడిటర్‌ షోమా చౌదరి గురువారం రాజీనామా చేశారు. జర్నలిస్టుపై తెహెల్కా వ్యవస్థాపక సంపాదకుడు తరుణ్‌ తేజ్‌పాల్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణల నేపథ్యంలో ఆయన గోవా పోలీసులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం నుంచి తరుణ్‌ తేజ్‌పాల్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన ఆరోపణలతో మనస్తాపం చెంది షోమా చౌదరి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. గురువారం ఉదయం ఆరు గంటలకే ఈ విషయమై ఆమె సహోద్యోగులకు లేఖ రాశారు. గత వారం రోజులుగా జరుగుతున్న సంఘటనలు తనపై వస్తున్న ఆరోపణలు మనస్తాపం కలిగించాయని ఆమె లేఖలో పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *