Tuesday, 3 November 2026

అన్నా మళ్లీ దీక్ష

శీతాకాల సమావేశాల్లోనే జన్‌ లోక్‌పాల్‌కు డిమాండ్‌
రాలేగాంసిద్ధి, నవంబర్‌ 28 (జనంసాక్షి) :
పటిష్టమైన లోక్‌పాల్‌ బిల్లు కోసం సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే మళ్లీ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. డిసెంబరు 10వ తేదీ నుంచి నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఇందుకు ఆయన స్వస్థలం రాలేగాంసిద్ధిలోని యాదవ్‌ బాబా దేవాలయాన్ని వేదికగా చేసుకోనున్నారు. ఈ మేరకు ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. పార్ల మెంటు శీతాకాల సమావేశాల్లో లోక్‌పాల్‌ బిల్లు తీసుకు వచ్చి కేంద్రం తన సత్తా చూపాలని హజారే కోరారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ఆ రంభం కానున్నాయి. రాజకీయ సంకల్పం లేనందునే లోక్‌పాల్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం పొందడంపై ప్రభుత్వం ఏడాదికాలంగా తాత్సారం చేస్తోందని హజారే విమర్శించారు. అవినీతి నిరోధక చట్టం తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమవడంపై తన అసంతృ ప్తిని వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు హజారే ఇటీవల ఓ లేఖ కూడా రాశారు. దీనిపై పార్లమెంటు వ్యవహారాలశాఖ మంత్రి వి.నారాయణ స్వామి హజారేకు రాసిన తిరుగులేఖలో లోక్‌పాల్‌ బిల్లు తీసుకురావడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని వివరించారు. మంత్రి లేఖ తనకు మంగళవారం అందిందని హజారే వెల్లడించారు గడచిన రెండేళ్లుగా లోక్‌పాల్‌ బిల్లు అంశమై ప్రభుత్వం, తనకూ మధ్య ఉత్తరప్రత్యు త్తరాలు నడుస్తున్నాయని అయినా ఎటువంటి ఉపయోగం లేకుండాపోయిందని హజారే ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *