Monday, 2 November 2026

అడవుల్ని, అటవీ సంపదని కాపాడేందుకు చర్యలు

– సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్‌, నవంబర్‌ 30 (జనంసాక్షి) :

అడవులను, అటవీ సంపదని కాపాడేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని నిర్వహిస్తున్న ఆ శాఖ అధికారుల సమావేశాన్ని శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. అడవుల రక్షణకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. అడవులను రక్షించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. స్మగ్లింగ్‌ అరికట్టేందుకు అందరూ సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అడవులు ధ్వంసం చేసేవారిపై కఠినమైన చట్టాలను రూపొందించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అటవీ అధికారులపైదాడులు చేసే వారిపైకఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాంటి వారికి మరణశిక్ష కన్నా కఠిన చట్టాలు అవసరమన్నారు. అడవుల రక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని అన్నారు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించకపోతే రాబోయే రోజుల్లో తీవ్ర దుష్ప్రరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇందుకు అడవుల రక్షణే ప్రధానమని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *