Tuesday, 3 November 2026

నేడు మరోమారు ఢిల్లీకి రాజనర్సింహ

హైదరాబాద్‌, డిసెంబర్‌ 1 (జనంసాక్షి) :

ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సోమవారం మళ్లీ ఢిల్లీకి వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో ఆయన పార్టీ అధిష్టానం పెద్దలు, జీవోఎం సభ్యులతో భేటీ అయి ఆదివారమే నగరానికి తిరిగివచ్చారు. మళ్లీ ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు అందడంతో ఆయన సోమవారం ఉదయం ఢిల్లీకి బయల్దేరుతారు. జీవోఎం కసరత్తు తుది దశకు చేరుకోవడంతో పాటు అధిష్టానం రాయల తెలంగాణ ప్రతిపాదనను తీవ్రంగా పరిశీలిస్తున్న నేపథ్యంలో ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు అందడం ప్రాధాన్యం సంతరించుకుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *