జైపూర్, డిసెంబర్ 1 (జనంసాక్షి) :
రాజస్థాన్ పోలింగ్ ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. 200 నియోజకవర్గాలున్న రాజస్థాన్ విధాన సభకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేయగా బీఎస్పీకి చెందిన అభ్యర్థి మృతితో ఒక నియోజకవర్గంలో పోలింగ్‌ను ఈనెల 13వ తేదీకి వాయిదా వేశారు. మిగతా నియోజకవర్గాల్లో ఓటువేసేందుకు ఓటర్లు బారులు తీరారు. సాయంత్రానికి 75 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఎన్నికల్లో 4.08 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి రాజస్థాన్‌లో అధికారాన్ని దక్కించుకుంటామని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు వసుంధరరాజే తెలిపారు.





