రాయల తెలంగాణ అంగీకరించం : కేసీఆర్
రేపు తెలంగాణ బంద్‌కు టీఆర్ఎస్ పిలుపు
హైదరాబాద్, డిసెంబర్ 3 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలైనా వదిలేందుకు సిద్ధంగా ఉన్నానని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. రాయల తెలంగాణ రాష్ట్ర ప్రతిపాదనకు నిరసనగా గురువారం తెలంగాణ బంద్‌కు పిలుపు ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మంగళవారం సాయంత్రం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు తెలంగాణ భవన్లో పార్టీ ముఖ్యులతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. బుధవారం తెలంగాణ పది జిల్లాల్లో నిరసనలు, ర్యాలీలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదన్నారు. తమకు పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే కావాలని ఆయన స్పష్టం చేశారు. తాము రాయల తెలంగాణను పూర్తిగా వ్యతిరేకిసున్నామని, ఎలాంటి ఆంక్షలు లేని పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే కావాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ దుర్మార్గ ఆలోచన చేస్తోందని మండిపడ్డారు. కేంద్ర కేబినేట్ జరుగుతన్న గురువారం బంద్ పాటించి నిరసన తెలుసుతామన్నారు. తమ పిల్లలు బలిదానాలు చేసుకున్నది, తాము ఆందోలన చేసింది, ఉద్యమాలు చేస్తున్నది రాయల తెలంగాణ కోసం కాదన్నారు. ఈ ప్రతిపాదన ఎవరి కోసమని కెసిఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని చూపుతూ సీడబ్ల్యూసీ విభజన నిర్ణయం ప్రకటించిందని, అదే నిర్ణయాన్ని యథాతథంగా ఆమోదిస్తున్నట్లు కేంద్రంత్రివర్గం ప్రకటించిందని కేసీఆర్ తెలిపారు. ప్రాణాలు పోయినా రాయల తెలంగాణను అంగీకరించబోమని ఆయన స్పష్టంచేశారు. ఇటు సూర్యుడు అటు పొడిచినా, తన ప్రాణాలు పోయినా రాయల తెలంగాణకు అంగీకరించం గాక.. అంగీకరించమన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదనకు వ్యతిరేకంగా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. 4న అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇందులో పార్టీ శ్రేణులు, పాఠశాల కళాశాల విద్యార్థులు పాల్గొనాలన్నారు. ప్రజలు 5న స్వచ్చందంగా బంద్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు. వ్యాపార వాణిజ్య వర్గాలు ఇందులో స్వచ్చందగా పాల్గొని తెలంగాణ ఐక్యత చాటాలన్నారు. హైదరాబాద్‌కు ఎలాంటి ప్రత్యేక ¬దాలు అవసరం లేదని ఇలాంటివి తెలంగాణ ప్రజలు అంగీకరించబోరని ఆయన వెల్లడించారు. రాయల తెలంగాణను ఎవరూ కోరలేదని ఆయన అన్నారు. 6న జరిగే తెరాస పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చిస్తామన్నారు. బుధవారం నుంచి మూడురోజుల పాటు జరగనున్న టిఆర్ఎస్ శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని కూడా వాయిదావేస్తున్నట్టు ఆయన తెలిపారు. రాయల తెలంగాణను కేంద్ర మంత్రుల బృందం (జీవోఎం) ఆమోదించబోతోందని వస్తున్న వార్తలపై టీఆర్ఎస్ అధినేత కెసిఆర్ తీవ్రంగా స్పందించారు. జీవోఎం రాయల తెలంగాణను ప్రతిపాదిస్తే తాము నిర్ద్వందంగా, ఖరాఖండిగా తిరస్కరిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల ఎమోషన్లకు లోబడే టీఆర్ఎస్ మాట్లాడుతుందని స్పష్టం చేశారు. ఈ రాయల తెలంగాణ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లను తెలంగాణ ప్రజల తరపున కోరుతున్నాని తెలిపారు. పది జిల్లాలతో కూడిన, హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ కావాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగంలో లేని ఆంక్షలు తెలంగౄణకు మాత్రమే ఎందుకని ప్రశ్నించారు. ఎక్కడా లేని చట్టాలు ఇక్కడే ఎందుకని అన్నారు. ఉమ్మడి రాజధాని అంశం రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. తెలంగౄణ వ్యతిరేక నిర్ణయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకే తాము స్పందిస్తున్నామని అన్నారు. 13 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తరవాత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం ఆహ్వానిస్తున్న తరుణంలో ఇప్పుడు కొత్త ప్రతిపాదనలు తీసుకుని రావడంలో ఆంతర్యమేమిటన్నారు. గత నిర్ణయాన్ని మార్చి మసిపూసి మారేడుగాయ చేసి, షరతులతో కూడిన తెలంగాణ ఇస్తామనడంలో అర్థం లేదన్నారు. శ్రీకాంతాచారిలాంటి యువకుల బలిదానాలు ఇందుకేనా అని ప్రశ్నించారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను నిరసిస్తూ సమస్త తెలంగాణ సమాజం బంద్‌లో పాల్గొనాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇది చాలా కీలక సమయమని వస్త్రవ్యాపారులు, విద్యార్థులు, ప్రభుత్వోద్యోగులు అందరూ బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అయినా కేంద్రం మొండిగా ముందుకు పోతే ఉద్యమకార్యాచరణ ప్రకటిస్తామన్నారు. నిజానికి వీరు తెలంగాణ సమస్య పరిష్కారించదల్చుకున్నరా లేక సీమాంధ్ర సమస్యలు తేదల్చుకున్నారా అన్నది అర్థం కావడం లేదన్నారు. ఆంధ్ర రాష్ట్రంగా వారు మంచిగా ఉన్నారని, దగా పడ్డది పది జిల్లాల తెలంగౄణ ప్రజలేనని అన్నారు. మా సమస్యలు పరిష్కరించమంటే కొత్త సమస్యలు తీసుకుని రావడం తగదన్నారు. ఇవన్నీ చూస్తే తెలంగాణను అడ్డుకునే కుట్ర జరగుఉతోందన్న అన్న అనుమానంతోనే తాము ఆందోలనకు దిగుతున్నామని అన్నారు. తెలంగాణ వ్యతిరేక కుట్రలు జరుగుతన్నాయని, అందుకే అడ్డుకోవాల్సి ఉందన్నారు. ఇక్కడ ఉద్యోగాలు పోయి, నీళ్లు దక్కక, వలసలు పోయి ప్రజలు దీనంగా ఉన్న దశలోనే పోరాటాలు చేశామన్నారు.





