Tuesday, 3 November 2026

మేము చెప్పామా…

ఎల్లో మీడియాకు చిదంబరం చురకలు
న్యూఢిల్లీ : పది జిల్లాలతో కూడిన తెలంగాణకు గతంలోనే కేబినెట్‌ అమోదం తెలిపిందని కేంద్రమంత్రి చిదంబరం అన్నారు. కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ ముగిసిన అనంతరం చిదంబరం విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ రాయలా తెలంగాణా ? అదెక్కడుంది ? అని ప్రశ్నించారు. పది జిల్లాల తెలంగాణకే కేబినేట్‌ ఆమోదం తెలిపిందని… అయితే మీరు 12 జిల్లాలు రాసుకుంటే మేమేం చేస్తామని ఆయన మీడియాపై ఎదురుదాడికి దిగారు. రాయాల తెలంగాణపై మీడియాలో వస్తున్న వార్తలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి కార్యాలయంలో దిగ్విజయ్‌ సింగ్‌, జీవోఎం సభ్యుడు జైరాం రమేష్‌, నారాయణ స్వామితో భేటీ అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *