ఇంత సుదీర్ఘ పోరాటం తర్వాత మొదటి రాష్ట్రం : జైపాల్‌రెడ్డి
న్యూఢిల్లీ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చారిత్రాత్మక నిర్ణయమని కేంద్ర మంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత ఆయన తెలంగాణ ప్రాంత నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పది జిల్లాల తెలంగాణ ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ప్రజలు సోనియాగాంధీకి రుణపడి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇంత సుదీర్ఘ పోరాటం తర్వాత ఏర్పడిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. తెలంగాణ సాధన కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న అరమవీరులకు ఆయన జోహార్లు అర్పించారు. శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలు ఏర్పడిన తెలుగు ప్రజలంతా ఒక్కటేనని, విడిపోయి అన్నదమ్ముల్లా కలిసుందామని సూచించారు.
ఇది చారిత్మ్రాక నిర్ణయం




