న్యూఢిల్లీ, డిసెంబర్ 7 (జనంసాక్షి) :
సాధారణ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల్లో తాజా ఎన్నికల ఫలితాలు ఆదివారం తేలనున్నాయి. ఐదు రాష్ట్రాల్లో నాలుగింటిలో బీజేపీ దూసుకుపోయిందన్న సర్వేలు నిజమా అబద్దమా అన్నది కూడా తేలనున్నాయి. ఫలితాలతో అటు మోడీ భవిత్యవ్యం, ఇటు రాహుల్ ఛరిష్మా కూడా ఏ పాటిదో తేలనుంది. దశలవారీగా జరిగిన పోలింగ్ నాలుగో తేదీకల్ల ఆ పూర్తయ్యింది. 8న ఉదయం ఓట్ల లెక్కింపునకు ఇసి పూర్తి ఏర్పాట్లు చేసింది. ఉదయం 8గంలటకు ఓట్ల లెక్కింపు ప్రారంభమయై 11 గంటలకల్లా ఫళితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, మిజోరంలలో ఎన్నికలు జరిగాయి. ఇందులో రెండు రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంది. అయితే మూడు రాష్ట్రాల్లో బిజెపి దూసుకుపోవడం ఖాయమని ఎగ్జిట్‌పోల్ సర్వే ఇప్పటికే వెల్లడించింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో మళ్లీ బిజెపి అధికారపీఠం దక్కించుకుంటారని, రాజస్థాన్‌లోనూ ఘనవిజయం దక్కే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ఢిల్లీలో హంగ్ ఏర్పడుతుందనుకున్నా అక్కడా బిజెపి పైచేయి సాధించిందన్న సర్వేలలు కూడా వచ్చాయి. మొత్తానికి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌్‌లో అధికారం నిలుపుకోవడంతో పాటు రాజస్థాన్, ఢిల్లీలను కాంగ్రెస్ నుంచి బిజెపి కైవసం చేసుకుంటుందని తెలుస్తోంది. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బ తప్పదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఓటర్లు కాంగ్రెస్‌కు మొండిచేయి చూపారని, బీజేపీ భారీ లబ్ధి పొందుతుందని చెబుతున్నాయి. బీజేపీ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు రాజస్థాన్, ఢిల్లీల్లోనూ విజయదుందుబి మోగిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ సర్వేలు వెల్లడించాయి. ఈ లెక్కన కాంగ్రెస్ ఢిల్లీ, రాజస్థాన్‌లో అధికారం కోల్పోవడంతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మరో విడత ప్రతిపక్షంలో కూర్చోకతప్పదని జోస్యం చెబుతున్నాయి. ఉదయం ఫలితాల లెక్కింపు మొదలయ్యాక మధ్యాహ్నానికి పూర్తి ఫళితాలు వెల్లడవుతాయి. ఈ ఫలితాలు లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో బిజెపి హ్యాట్రిక్‌కు అవకాశం ఉందని, ఆ పార్టీ మరింత బలం పెంచుకుందని సర్వే పేర్కొంది. ఇక్కడ 150 నుంచి 172 స్థానాలు దక్కే అవకాశం ఉందని, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పుంజుకోలేకపోయిందని సర్వే తెలిపింది. కాంగ్రెస్‌కి 53 నుంచి 71 మధ్య స్థానాలు లభించే అవకాశం ఉందని, రాజస్థాన్‌లో కాంగ్రెస్ 30 నుంచి 48 సీట్లకే పరిమితమయ్యే అవకాశం ఉందని పేర్కొంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ 30 నుంచి 48 సీట్లకే పరిమితమయ్యే అవకాశం ఉందని, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కు 32 నుంచి 46 సీట్లు దక్కే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. రాజస్థాన్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని సర్వేలు పేర్కొన్నాయి. అశోక్ గెహ్లాట్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని వెల్లడించాయి. రాజస్థాన్లో బీజేపీ ఘనవిజయం సాధిస్తుందని జోస్యం చెప్పింది. 130 నుంచి 150 స్థానాలు వరకు అసెంబ్లీ సీట్లు సాధిస్తుందని తెలియజేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎటువంటి వ్యతిరేకత లేదని , తాము చేపట్టిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఓటర్లు స్పందిస్తారని ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. మిజోరాంను పక్కనబెడితే మిగిలిన రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలిన్లయితే పార్టీలో అనూహ్య మార్పులకు దారితీయొచ్చని కాంగ్రెస్ వర్గాల సమాచారం. కేవలం పార్టీలోనే కాకుండా ప్రభుత్వంలోనూ మార్పులు చేర్పులుండే అవకాశముందని అంటున్నారు. మరో ఐదు నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కొంత మంది మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించొచ్చంటున్నారు. అయితే విూడియాలో చెబుతున్నంత దారుణంగా పార్టీ పరిస్థితి ఈ రాష్టాల్రఎన్నికల్లో ఉండదన్నది కాంగ్రెస్‌నేతలు కొందరి ధీమా. ఛత్తీస్‌గఢ్‌లో తాము గెలుస్తామన్నది వారి ఆశ. ఒకవేళ నాలుగు రాష్ట్రాల్లోనూ ఓడిపోతే అది యూపీఏకు వ్యతిరేక పవనంగా భావించాలి. ఒకరాష్ట్రంలో నెగ్గి మూడింట ఓడితే కాసింత వెసులుబాటు లభిస్తుంది. ఫలితం 2-2 అయితే కాంగ్రెస్ దూకుడుగా వెళ్తోంది. రాహుల్ సారథ్యంపై నమ్మకం పెరుగుతుంది. మోడీకది మైనస్ పాయింట్ అవుతుంది. అలాకాకుండా దారుణంగా ఫలితాలుంటే మాత్రం కొంతమంది ముఖ్యనేతలు, కేబినెట్ మంత్రులదే బాధ్యత అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. మొత్తానికి కాంగ్రెస్ ఓడిపోతే మాత్రం రాహుల్ పనితీరుపై మళ్లీ చర్చ మొదలవ్వం ఖాయంగా కనిపిస్తోంది.
ఐదు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు నేడే




