Tuesday, 3 November 2026

ఇది ప్రజావిప్లవం

ప్రతిపక్షంలో కూర్చుంటాం : కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ, డిసెంబర్‌ 8 (జనంసాక్షి) :
ఢిల్లీ ప్రజలిచ్చిన తీర్పు ప్రజావిప్లవానికి సంకేతమని ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అరవింద కేజ్రీవాల్‌ తెలిపారు. ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ విజయం సాధించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో రాజకీయ విప్లవం ఆరంభమైందని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. నవతరం చైతన్యంతో భారత్‌ వేగంగా మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆకాంక్షించారు. యువతకు అభినందనలు తెలియజేశారు. కనాట్‌ప్లేస్‌లోని హనుమాన్‌ రోడ్డులో గల పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తలతో కలిసి ఆయన సంబరాల్లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *