హైదరాబాద్, డిసెంబర్ 9 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి మళ్లీ గదే కిరికిరి పెట్టాడు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుందంటూ అవే మాటలు మాట్లాడారు. అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమష్టిగా కృసి చేసినందువల్లే ఇండియాటుడే ప్రతిష్టాత్మక ఉత్తమ పాలన అవార్డుకు కిరణ్ అన్నారు. ఇండియాటుడే అవార్డు రాష్ట్రానికి దక్కడం సంతోసంగా ఉందని సీఎం కిరణ్‌కుమార్ అన్నారు. గతేడాది ఈ అవార్డుకు గుజరాత్ రాష్ట్రం ఎంపికైందని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి అందరం కలిసి కృషి చేస్తున్నామని, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు రాష్ట్రంలో ప్రతి పౌరుడికి అందాలంటే అది సమక్య రాష్ట్రంలోనే సాధ్యమని పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రం అమలు చేస్తున్న ఎన్నో ప్రతిష్టాత్మక పథకాలు ఫలితాలు కింది స్థాయి వరకూ చేరుతున్నాయని అన్నారు. ఈ సమయంలో విభజనం అంశం రావడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
కిరణ్ గదే కిరికిరి సమైక్యంగా ఉంటేనే రాష్ట్రాభివృద్ధి




