Wednesday, 4 November 2026

మండేలా ఓ గొప్ప పోరాట యోధుడు

గాంధీ అహింసకు ఆయనకు దగ్గరి పోలికలున్నాయి
రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ
జోహెన్స్‌బర్గ్గ్‌, డిసెంబర్‌ 10 (జనంసాక్షి) :
నెల్సన్‌ మండేలా గొప్ప పోరాట యోధుడని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ కొనియాడారు. పోరాట యోధుడిగా మండేలా చరిత్ర పుట్టల్లో నిచిపోతాడని ఆయన పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలోని జోహెన్స్‌బర్గ్‌లో మంగళవారం జరిగిన మండేలా సంతాప సభలో ఆయన మాట్లాడారు. మహాత్మాగాంధీ తరహాలోనే మండేలా కూడా దక్షిణాఫ్రికా విముక్తి కోసం అహింసా మార్గాన్ని చేపట్టాని గుర్తు చేశారు. ఆయన జీవితమంతా త్యాగాలతోనే సాగిందని అన్నారు. సమసమాజం, స్వేచ్ఛ స్వాతంత్య్రాల కోసం పోరాడే వారందరికీ స్ఫూర్తి ప్రదాత అని అన్నారు. మండేలా మృతిలో ప్రపంచం గొప్ప పోరాట యోధుడ్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా గొప్ప పోరాటం సాగించారని అన్నారు. మండేలా సామాజిక మార్పులకు శ్రీకారం చుట్టారని, ఈ శతాబ్దపు త్యాగధనుడని కీర్తించారు. మండేలా సంతాప సభకు లక్షల సంఖ్యలో దక్షిణాఫిక్రా ప్రజలు తరలి వచ్చారు. వివిధ దేశాల నేతలు కూడా హాజరయ్యారు. భారతదేశం తరఫున రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి, యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్‌, సీపీఎం నేత సీతారాం ఏచూరి పాల్గొన్నారు. ఆమెరికాను అబ్రహాం నింకన్‌ ఏ విధంగా ఒకటి చేశారో అదే విధంగా నిల్సన్‌ మండేలా దక్షిణాఫిక్రాను అదేరీతిలో ఏకం చేశారని ఆ దేశాధ్యక్షుడు బరాక్‌ ఒబామా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిలో మండేలా పోరాట యోధుడిగా నిచిపోతారని అన్నారు. మండేలా స్ఫూర్తిని నన్ను మరింత ఉత్తముడిగా తీర్చిదిద్దిందని ఒబామా అన్నారు. 20వ శతాబ్దపు అత్యుత్తమ స్వేచ్ఛా పిపాసి అని మండేలాను కొనియాడారు. బృహత్తర లక్ష్యం చేరుకునే దిశలో ఆయన ఎవరికీ, దేనికీ భయడలేదని అన్నారు. 27 సంవత్సరాలు మండేలా జైలు జీవితం గడిపినా ఆయనను ఏమీ చేయలేకపోయిందని అన్నారు. ప్రపంచంలోని కోట్లాది మందిలో పోరాట స్ఫూర్తిని నింపిన గొప్ప వ్యక్తి మండేలా అని అన్నారు. మహాత్మాగాంధీ అహింసా విధానాన్నే మండేలా కూడా తన దేశంలో కొనసాగించారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుకు కూడా పిల్లలు ఆకలి, ఆనారోగ్య బాధతో ఉన్నారని వారందరికీ న్యాయం కల్పించేందుకు కొత్త ఉద్యమాలను తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఒబామా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *