చాలా రాష్ట్రాలకు అసెంబ్లీ తీర్మానం లేదు
కుండబద్దలు కొట్టిన షిండే
న్యూఢిల్లీ, డిసెంబర్ 10 (జనంసాక్షి) :
ఆంధప్రదేశ్ రాష్ట్ర విభజన పక్రియ రాజ్యాంగం ప్రకారమే జరుగుతుందని కేంద్ర ¬ం మంత్రి సుశీల్ కుమార్ షిండే మరోమారు స్పస్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదన్నారు దీనిపై వస్తున్న ఊహాగానాలు కూడా సరికాదన్నారు. ఇది వరకు ఏర్పడిన చాలా రాష్ట్రాలకు అసెంబ్లీ తీర్మానం లేదని, శాసనసభ అభిప్రాయాన్ని మాత్రమే కోరుతామని ఆయన తెలిపారు. కొందరు అన్నట్లుగా ఇది రాజ్యాగానికి లోబడలేదన్నది సరికాదన్నారు. ¬ంశాఖ పనితీరుపై నెలవారీ సమీక్షలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2004, 2009 ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ అంశం ఉందని స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లు కేంద్ర మంత్రి వర్గం ఆమోదం పొందిందని, ప్రస్తుతం బిల్లు రాష్ట్రతి వద్ద ఉందని చెప్పారు. గతంలో ఇచ్చిన హావిూ మేరకు, వివిధ పార్టీలు అఖిలపక్షంలో ఆమోదం పొందిన తరవాతనే కేంద్రం నిర్ణయం తీసుకున్నదని అన్నారు. తెలంగాణ బిల్లును రాష్ట్రపతి అసెంబ్లీకి పంపిస్తారని, అసెబ్లీ అభిప్రాయాలు అందిన తర్వాత బిల్లు మళ్లీ మంత్రివర్గానికి వస్తుందన్నారు. తెలంగాణ బిల్లుపై అసెంబ్లీలో చర్చించేందుకు రాష్ట్రపతి ఎంత సమయం ఇస్తారో తనకు తెలియదన్నారు. ప్రస్తుత సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. అవిశ్వాస తీర్మానాలపై స్పీకర్ సభలో చెప్పారని, అవిశ్వాసంపై స్పీకర్, ప్రభుత్వం ఎవరి బాధ్యతలను వారు నిర్వహిస్తారన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే మత హింస నిరోధక బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఢిల్లీలో పరిస్థితిని లెప్టినెంట్ గవర్నర్ పరిశీలిస్తున్నట్లు షిండే వివరించారు. అయితే ఇక్కడ ఎవరికి మెజారిటీ రాని విషయం తెలిసందే. ఐదు రాష్ట్రల ఎన్నికల ఫలితాలపై కూడా సుశీల్‌కుమార్ షిండే మీడియా సమావేశంలో స్పందించారు. ఎన్నికల ఫలితాలపై ప్రజాతీర్పును శిరసావహిస్తామని తెలిపారు. ఢిల్లీలో పరిస్థితిని లెఫ్టినెంట్ గవర్నర్ సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు వ్యవహారం తన దృష్టికి రాలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో విూరే చూస్తారని పేర్కొన్నారు. గత రెండు ఎన్నికల మేనిఫెస్టోలోనూ తెలంగాణ రాష్ట్రం ఇస్తామని హామీ ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. అసెంబ్లీ అభిప్రాయం చెప్పకపోతే కేంద్రమే నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. విభజనపై పూర్తి అధికారం కేంద్రానికి ఉందని తేల్చి చెప్పారు. ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. రాజ్యంగం ప్రకారమే విభజన జరుగుతుందన్నారు. అసెంబ్లీ నుంచి టీ బిల్లు కేబినెట్‌కు వస్తుందని పేర్కొన్నారు.
రాజ్యాంగబద్దంగానే రాష్ట్ర విభజన




