ప్లేస్.. డేట్ నువ్వే చెప్పు
కేసీఆర్కు బాబు సవాల్
హైదరాబాద్, డిసెంబర్ 11 (జనంసాక్షి) :
తెలంగాణ అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమేనని, ప్లేస్.. డేట్ కేసీఆరే చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కేసీఆర్కు ప్రతిసవాల్ విసిరారు. రాష్ట్ర విభజనకు సంబంధించి విసృతస్థాయి చర్చల్లో ఏకాభిప్రాయం వచ్చిందని కేంద్రం పేర్కొనడం సరికాదని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. ఏకాభిప్రాయం వస్తే ఎంపీలు ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తారని అన్నారు. కాంగ్రెస్ తన స్వప్రయోజనాలకు అనుకూలంగా మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఈ దేశ సంప్రదాయాలు తెలియవన్నారు. భారత్లో ఇటలీ రాజ్యాంగాన్ని అమలుచేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆంధ్ర రాష్ట్రం కూడా అనేక కమిటీలు, కమిషన్లు వేసిన అనంతరం మాత్రమే ఏర్పాటు చేసిందన్న అంశాన్ని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి విసృతస్థాయి చర్చల్లో ఏకాభ్రియం వచ్చిందని కేంద్రం పేర్కొనడాని ఆయన తప్పుపట్టారు. ఆంధ్ర రాష్ట్రం కూడా అనేక కమిటీలు, కమిషన్లు వేసిన అనంతరం మాత్రమే ఏర్పాటు చేసిందన్న అంశాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. తెలంగాణపై విస్తృతమైన ఏకాభిప్రాయం వచ్చిందని చెప్పడంలో నిజం లేదని అన్నారు. ఢిల్లీలో కూర్చుని కలలు కంటే జీవోఎం ఏకాభిప్రాయమా అని ఆయన అడిగారు. రాజ్యాంగంలోని వివిధ భాగాలను ఆయన చదివి వినిపించారు. సర్కారియా కమిషన్ ఏం చెప్పిందో కూడా వివరించారు. గతంలో మద్రాసు నుంచి విడదీసి ఆంధ్ర రాష్టాన్న్రి ఏర్పాటు చేయడానికి కమిటీలు, కమిషన్లు వేశారని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు ఏ ప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేశారని చంద్రబాబు అడిగారు. రాష్ట్రాభివృద్ధితో పాటు వ్యక్తిగత అంశాలపై తాను చర్చకు సిద్ధమని బాబు అన్నారు. వైఎస్ తెలంగాణ భూములు విక్రయిస్తుంటే ఏం చేశావని కేసీఆర్ను ప్రశ్నించారు.
చర్చకు సిద్ధం




