Tuesday, 3 November 2026

బంగ్లా యుద్ధనేరాల ఖైదీ అబ్దుల్‌ ఖాదర్‌కు ఉరి

ఢాకా, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) :

యుద్ధనేరాల ఖైదీ అబ్దుల్లా ఖాదర్‌ ముల్లాకు బంగ్లాదేశ్‌ ప్రభుత్వం గురువారం ఉరిశిక్ష అమలు చేసింది. ఢాకాలోని సెంట్రల్‌ జైల్లో రాత్రి 10:01 గంటలకు ఖాదర్‌ ముల్లాను ఉరి తీసినట్లు జైలు అధికారులు తెలిపారు. రెండు రోజుల క్రితం ఉరితీయాల్సి ఉండగా అనుకోని పరిస్థితుల్లో చివరి నిమిషంలో వాయిదా వేశారు. అయితే గురువారం సుప్రీం కోర్టు ఉరితీతపై రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చిన కొన్ని గంటల తర్వాత ఉరిశిక్షను అమలు చేశారు. 1971లో బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర సంగ్రామంలో ముల్లా దేశ ప్రజలను హత్య చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ముల్లా జమాతే ఇ ఇస్లామి పార్టీ అధ్యక్షుడు. ఇన్నాళ్లకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఇప్పటి వరకు దేశంలో స్వాతంత్య్ర సంగ్రామంలో హత్య ఆరోపణలు ఎదుర్కొని శిక్ష పడిన తొలి వ్యక్తి ముల్లా. స్వాతం్ణత్య పోరాటం సయమంలో ఈయన మీర్‌పూర్‌లో మహిళలను రేప్‌ చేశాడని, నరమేధం సృష్టించాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. పాకిస్తాన్‌ బలగాలు, మీర్‌పూర్‌లో ఆల్‌ బదర్‌ మిలిషియా తో కలిసి పెద్ద సంఖ్యలో ప్రజలను హత్య చేశాడు. చిన్నపిల్లలని కూడా చూడకుండా వారి హత్యలకు కారణమయ్యాడు. ఇంతకు ముందు వేసిన పలు రిపోర్ట్స్‌ కూడా ఇతనిని ఉరితీయాలనే తేల్చాయి. అయితే గురువారం ఉదయం మీరు రివ్యూ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిందని దేశ అధ్యక్షుడిని క్షమాభిక్ష పెట్టమని కోరుతార అని ముల్లా అడిగినట్లు జైలు అధికారుల తెలిపారు. అయితే దానిని ఆయన తిరస్కరించినుట్లు తెలిపారు. మల్లా ఉరితీతకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తే అవకాశం ఉన్నందున ఇప్పటికే ప్రభుత్వ పలు చర్యలు తీసుకుంది. ఢాకాతో పాటు పలు పట్టణాల్లో పారమిలిటరీ దళాలను మోహరించింది.ర్యాపిడ్‌ యాక్షన్‌ బెటాలియన్‌ పలు ప్రాంతాల్లో కట్టుదిట్టమై భద్రతను ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు ముల్లా రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించిన వెంటనే దేశ వ్యాప్తంగా నిరసనల వెల్లువెత్తాయి. పలు ప్రాంతాల్లో ముస్లిం నేతలు ధర్నా చేశారు. పలు ప్రాంతాల్లో నాయకులు, కార్యకర్తలు పోలీసులతో ఘర్షణ దిగారు. ముల్లాతో పాటు గతంలోనే కోర్టు ఉరిశిక్ష విధించింది. దీనిని ప్రతిపక్ష పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంద. అయితే జమాతే ఇ ఇస్లామీ పార్టీ నాయకులను లేకుండా చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తోంది. దేశంలో 2010 తర్వాత ఒక పెద్ద నాయకుడిని ఉరితీయడం ఇదే తొలిసారి. 2010లో మాజీ ప్రధాని ముజిబుర్‌ రహ్మాన్‌ను హత్య చేసిన ఐదుగురు మాజీ సైనికులను ఉరితీశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *