ప్రత్యేక విమానంలో ముసాయిదా
తెలంగాణ జెట్ స్పీడ్ (కిక్కర్)
గవర్నర్, సీఎం, సీఎస్, అసెంబ్లీ కార్యదరికి అందిన ప్రతులు
నేడు సభలో ప్రవేశపెట్టాలని తెలంగాణవాదుల డిమాండ్
హైదరాబాద్, డిసెంబర్ 12 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ జెట్ స్పీడ్‌తో ముందుకెళ్తోంది. బుధవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదముద్ర వేసిన తెలంగాణ బిల్లు గురువారం సాయంత్రం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరింది. బీఎస్‌ఫ్‌కు చెందిన ప్రత్యేక విమానంలో దేశరాజధాని నుంచి ¬ంశాఖ సంయుక్త కార్యదర్శి సురేష్‌కుమార్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా సచివాలయం చేరుకొని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతిని కలిసి బిల్లు ప్రతులను అందించారు. బిల్లు ప్రతులను ఐదు బండిల్స్‌లో తీసుకువచ్చారు. సురేశ్‌కుమార్ అనంతరం సీఎం క్యాంప్ ఆఫీస్‌కు చేరుకొని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, గవర్నర్ నరసింహన్‌కు, శాసనసభ కార్యదర్శి రాజ సదారాంకు బిల్లు ప్రతులను అందజేశారు. బిల్లు శుక్రవారమే శాసనసభ ముందుకు వచ్చే అవకాశముంది. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్‌బాబు కూడా ఈ విషయాన్ని తేల్చిచెప్పారు. తెలంగాణ బిల్లుపై చర్చించి, అభిప్రాయాలను తెలియజేయడానికి రాష్ట్ర అసెంబ్లీకి జనవరి 23 వరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ బిల్లు మీద ఇప్పటికే సీమాంధ్ర ప్రాంత నాయకులు మండిపడుతున్నారు. ఇవన్నీ ఇలా జరుగుతుండగానే తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రానికి చేరింది. ఈ దశలో శుక్రవారం మరోమారు బీఏసీి సమావేశం ఏర్పాటు చేసి సభలో పెట్టనున్నారు. ఇదిలావుంటే బిల్లును వెంటనే సభలో పెట్టాలని కోరుతామని చీఫ్‌విప్ గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. ఈ సమావేశాల్లోనే చర్చకు పెట్టాలన్నారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీ ముందుకురానున్న నేపథ్యంలో రాజధాని హైదరాబాద్‌లో విభజన రాజకీయాలు వేడెక్కాయి. మరోవైపు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ రాకతో రాజకీయ సెగ పెరిగింది. విభజన బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసే బాధ్యతను ఆయన భుజాలకెత్తుకున్నారని అందుకనే వచ్చారని ప్రచారం సాగింది. ఓ వైపు అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కావడంతో ఎక్కడ చూసినా ఇవేరకమైన చర్చలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి లేక్ వ్యూ అతిథి గృహంలో డిగ్గీతో మధ్యాహ్నం రెండున్నర గంటలకు భేటీ అయ్యారు. అరగంటకు పైగా వారి కొనసాగింది. ఇరువురు విభజన అంశం పైనే చర్చించారు. విభజనకు అనుకూలంగా సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి కిరణ్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీంతో దిగ్విజయ్ ముఖ్యమంత్రిని బుజ్జగించే ప్రయత్నాలు చేసినట్లుగా చెబుతున్నారు. అయితే కిరణ్ మాత్రం విభజనకు ససేమిరా అంటున్నారంటున్నారు. ఈ దశలో ఆంధప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013 రాష్ట్ర ప్రభుత్వానికి చేరడంతో, ఈ బిల్లు ప్రస్తుత సమావేశాల్లో వస్తుందా రాదా అన్న చర్చ సాగుతోంది. రావాల్సిందేనని టిఆర్‌ఎస్ నేతలు ఈటెలతో పాటు తెలంగౄణ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రులు పట్టుబడుతున్నారు. బిల్లు ప్రతి వచ్చీ రాగానే ఉన్నతాధికారులు దాన్ని సీఎం సమక్షంలో పెట్టినట్లు సమాచారం. ఇక కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసి పంపిన విభజన బిల్లుపై న్యాయ సలహా తీసుకున్న తర్వాత శాసనసభ, శాసనమండలి అభిప్రాయం కోరుతూ దాన్ని యథాతథంగా రాష్ట్రానికి పంపించారు. బిల్లుపై ఆరు వారాల్లోగా ఉభయ సభల అభిప్రాయం చెప్పాలని రాష్ట్రపతి నిర్దేశించారు. ఈ దశలో ఇప్పుడు సమావేశాల్లో రాదన్న సంకేతాలు వస్తున్నాయి. అయితే బిల్లుపై కిరణ్‌తో దిగ్విజయ్ చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ప్రాంత మంత్రులు, నేతలు కూడా ఈ సమావేశాల్లోనే బిల్లు తీసుకుని రావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సచివాలయానికి బిల్లు చేరడంతో తెలంగాణనేతలు తమ కార్యాచరణ ముమ్మరం చేశారు. ఎక్కడిక్కడ భేటీలు సాగుతున్నాయి. ఎవరిఇక వారు వ్యూహాల్లో మునిగిపోయారు. బిల్లు ఆగమేఘాల విూద విమానంలో తీసుకుని రావడమేమిటని టిడిపి అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బీఏసీలో ఈ అంశాన్ని చేర్చి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రితో బిల్లును సభలో చర్చకు పెట్టించడాలని టీ కాంగ్రెస్ నేతలతో పాటు జేఏసీ నాయకులు దిగ్విజయ్‌ను కోరారు. ఈనేపథ్యంలో శుక్రవారం ఎలాంటి పరిణామాలు జరుగబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.