భాజపా అగ్రనేతలతో మంతనాలు
భోపాల్, డిసెంబర్ 14 (జనంసాక్షి) :
ఇంతకాలం అంటరానోళ్లలా వ్యవహరించిన బీజేపీ, టీడీపీలు ఏకమవుతున్నాయి. మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకారానికి ఎన్‌డీయేతర పక్షం టీడీపీ అధినేత చంద్రబాబు హాజరుకావడంతో ఇది స్పష్టమైంది. అయితే అపవిత్ర కలయిక తెలంగాణను అడ్డుకోవడానికేనని తేలిపోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎలాగైనా అడ్డుకోవాలని పంతం పట్టిన చంద్రబాబు ఎన్‌డీఏతో అపవిత్ర మైత్రిబంధంతో లాబీయింగ్ మొదలుపెట్టారు. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం నాడు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకార మ¬త్సవానికి వచ్చిన చంద్రబాబు, నరేంద్ర మోడీతో గంటకు పైగా మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పొత్తులతో పాటు సమకాలీన సమస్యలు, రాజకీయాలు, విబజన అంశాలు వారు చర్చించి ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు. వారిద్దరి మధ్య జరిగిన రహస్య చర్చల్లో ఎన్నికల పొత్తు అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు బిజెపి అగ్రనేతలు అద్వానీ, సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్‌లతో విడివిడిగా చర్చలు జరిపారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని ప్రకటించినప్పటి నుంచి బిజెపికి దగ్గరవుతూ వస్తున్నారు. ఢిల్లీలో గతంలో ఓ కార్యక్రమంలో నరేంద్ర మోడీతో కలిసి వేదికను కూడా పంచుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆంధప్రదేశ్‌లో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్‌సింగ్ చౌహాన్ శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ శివరాజ్ సింగ్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్, పార్టీ సీనియర్ నేత ఎల్‌కె ఆద్వానీ, పార్టీ సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడు హాజరయ్యారు. వరుసగా మూడోసారి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి పగ్గాలు చేపట్టారు. మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బిజెపికి 168 సీట్లు వచ్చాయి. 230 సీట్లున్న మధ్యప్రదేశ్ శాసనసభలో కాంగ్రెసు బలం 71 నుంచి 58కి తగ్గిపోయింది. దేశంలో మోడీకి ఆదరణపెరగడంతో ఇప్పుడు బాబు కూడా బిజెపితో కలసి వెలల్నున్నారన్న ప్రచారం ఊపందుకోవడం, బాబు భోపాల్ రావడం పై అనుమానాలు బలపడుతున్నాయి. శనివారం మధ్యాహ్నం భోపాల్‌లోని జంబూరీ మైదానంలో మధ్యప్రదేశ్ గవర్నర్ రాం నరేష్‌యాదవ్ శివరాజ్‌సింగ్ చౌహాన్‌తో ప్రమాణం చేయించారు. శివరాజ్‌సింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం వరుసగా ఇది మూడో సారి. బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ, జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, భాజపా లోక్‌సభాపక్ష నేత సుష్మాస్వరాజ్, అగ్రనేతలు ఎల్.కె.అద్వానీ, వెంకయ్యనాయుడు, రాజస్థాన్ సీఎం వసుంధర రాజే, ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్‌రావు, ఎం.ఎన్.ఎస్ అధినేత ఉద్ధవ్ థాక్రే, బిజెపి సీనియర్ నేతలు రవిశంకర్ ప్రసాద్, జశ్వంత్‌సింగ్, అరుణ్‌జైట్లీ, ఉమాభారతి, పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ తదితరులు శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
అంటరానోళ్లు ఏకమయ్యారు తెలంగాణను అడ్డుకునేందుకు బాబు లాబీయింగ్




