కదిలి వచ్చిన అశేష జనవాహిణి
జోహెన్నస్‌బర్గ్, డిసెంబర్ 15 (జనంసాక్షి) :
దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన కునులో ఆదివారం జరిగాయి. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి నల్ల సూరీడుకి కన్నీటి వీడ్కోలు పలికారు. బ్రిటన్ యువరాజు చార్లెస్ సహా పలువురు దేశాధినేతలు, సౌతాఫ్రికా అధ్యక్షుడు జాకొబ్ జుమా, మండేలా భార్య గ్రాకా మాచెల్, మాజీ భార్య విన్నీ మండేలా అంత్యక్రియలకు హాజరయ్యారు. శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో పాటు పలువురు సన్నిహితులు జాగారం చేసి మండేలా జీవిత ఘట్టాలను పాటలు పాడుతూ, ముఖ్య సంఘటనలను స్మరించుకుంటూ గడిపారు. ఆదివారం ఉదయం మండేలా ఇంటి నుంచి సమాధి చేసే స్థలం వరకు ఆయన మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకు వచ్చారు. నేవీ అధికారులు బారులు తీరారు. ఆయన భార్య గ్రాకా మాచెల్, మాజీ భార్య విన్నీ కదిలి వచ్చిన అశేష జనవాహిణిమండేలా, ఆయన సంతానం, మనవలు, మనవరాళ్లు మండేలా భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అక్కడి సంప్రదాయం ప్రకారం, అధికార లాంచనాలతో సరిగ్గా సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు, నీడ అతి తక్కువగా ఉన్నప్పుడు అంత్యక్రియలు నిర్వహించారు. మండేలా అంత్యక్రియల కార్యక్రమాన్ని దేశ ప్రజలంతా చూసేందుకు వీలుగా ప్రత్యక్ష ప్రసారం చేశారు. దాదాపు 4500 మంది ప్రముఖులు మాత్రమే అంత్యక్రియల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు.
నల్ల సూరీడుకి కన్నీటి వీడ్కోలు




