ప్రతిఘటించిన స్వామిగౌడ్
నన్నపనేని హైడ్రామా
హైదరాబాద్, డిసెంబర్ 16 (జనంసాక్షి) :
తెలంగాణ ఏర్పాటు బిల్లు ప్రతులను సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టిడిపి, వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చించి వేశారు. అదేపనిగా వారు బిల్లు ప్రతులను చింతుతూ తెలంగాణపై తమ అక్కసు వెళ్లగకాక్కరు. ఈ పరిణామంతో తెలంగాణ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రజలను అవమానించడమేనంటూ అడ్డుకనే ప్రయత్నం చేశారు. పోయారు. బిల్లు ప్రతులను చించివేయడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని పేర్కొంటూ సీమాంధ్ర ఎమ్మెల్యేల వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అప్రమత్తమై ఘర్షణ తలెత్తకుండా నివారించారు. ఓ వైపు సీమాంధ్ర, మరోవైపు తెలంగాణ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ వాతావరణ చోటుకు చేసుకుంది. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. ఇరు ప్రాంత నేతలు ఒకరినొకరు తోసుకోవటంతో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కనీసం బీఏసీని కూడా పిలవకుండా తెలంగాణ బిల్లును అసెంబ్లీలో ఎలా ప్రవేశపెడతారంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లు ప్రతులను తగులబెట్టారు. దీంతో చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి.. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. గండ్రకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తోడు కావటంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని వారించే ప్రయత్నం చేసినప్పటికీ ఎవరు కూడా వెనక్కి తగ్గలేదు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమవిూద దాడి జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ధర్మాన కృష్ణదాసు అభివర్ణించారు. ఇందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడులే బాధ్యత వహించాలన్నారు. ఈ దశలో జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ నినాదాలతో మీడియా పాయింట్ వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. పోలీసులు సర్దిచెప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నా, ఏ ఒక్కరూ వినే పరిస్థితి కనిపించలేదు. అసెంబ్లీలో కూడా సమైక్యతీర్మానం చేయాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. సమైక్య రాష్ట్రం కోసం చివరివరకు పోరాడతామని స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విూడియాతో మాట్లాడనీయకుండా అక్కడినుంచి పంపేందుకు ప్రయత్నాలు చేశారు. మరోవైపు ఆంధప్రదేశ్ పునర్ వ్యవ్థసీకరణ బిల్లును లద్ఘిర్మన్ చక్రపాణి మండలిలో ప్రవేశ పెట్టిన నేపథ్యంలో శాసనమండలి మీడియా పాయింట్ వద్ద టిడిపి, తెరాస ఎమ్మెల్సీల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మండలి వాయిదా పడిన అనంతరం విూడియా పాయింట్ వద్ద టిడిపి ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి మాట్లాడుతుండగా తెరాస ఎమ్మెల్సీ స్వామిగౌడ్ అడ్డు తగిలారు. జై సమైక్యాంధ్ర అంటూ సతీష్‌రెడ్డి బిల్లు ప్రతులను చించివేశారు. దీంతో ఇరుపార్టీల ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో టిడిపి ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కిందపడ్డారు. పోలీసులు అప్రమత్తమై ఇరువర్గాలను అడ్డుకున్నారు. అనంతరం ఇరు పార్టీల ఎమ్మెల్సీలు బల్లలపై కెక్కి నినాదాలు చేశారు. శాసనమండలి విూడియా పాయింట్ వద్ద దాదాపు గంట సేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓదశలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద తెలంగాణ ప్రాంత జర్నలిస్టులు కూడా ఆందోళనకు దిగారు. ప్రతులను చింపేయడం దారుణమని ఖండించారు. ఇది పూర్తి అనగరిక చర్యగా అభివర్ణించారు. దీనికి నిరసనగా వారు జై తెలంగాణ నినాదాలు చేశారు. శాసనమండలి మీడియా పాయింట్ వద్ద సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్సీల మధ్య తోపులాట జరిగింది. తెలుగుదేశం పార్టీకి చెందిన సతీష్ రెడ్డి, నన్నపనేని రాజకుమారి తదితరులు బిల్లు తప్పులు తడకలుగా ఉందని, ఇలాంటి బిల్లును కనీసం చూసుకోకుండా ఎలా ప్రవేశపెడతారని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని మండిపడుతూ మీడియా పాయింట్లో మాట్లాడారు. సరిగ్గా ఇదే సమయంలో వారు అక్కడ ఉండగానే టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన స్వామిగౌడ్, మరికొందరు ఎమ్మెల్సీలు, కపిలవాయి దిలీప్‌కుమార్ తదితరులు కూడా అక్కడకు వచ్చారు. సీమాంధ్ర ఎమ్మెల్సీలను మాట్లాడనివ్వకుండా వారిని అడ్డుకుంటూ తెలంగాణ నినాదాలు చేయసాగారు.ఈ సందర్భంగా ఇరు ప్రాంతాల సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం, ఉద్రిక్తత చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా సతీష్ రెడ్డి, నన్నపనేనిలను వారించేందుకు వెళ్లగా నన్నపనేని రాజకుమారి కింద పడిపోయారు. ఇద్దరు ఎమ్మెల్సీలు ఆమెను చేతులు పట్టుకుని పైకి లేవదీయాల్సి వచ్చింది. ఈ సంఘటన తర్వాత ఎదురుగా ఉన్న టేబుల్ విూదకు నన్నపనేని ఎక్కి, ఆవేశంగా మాట్లాడుతూ, నినాదాలు చేస్తుండగా, స్వామిగౌడ్ కూడా ఆమెకు పోటీగా టేబుల్ విూదకు ఎక్కి మాట్లాడటం, నినాదాలు చేయడం మొదలుపెట్టారు. పెద్దల సభ అన్న గౌరవం కూడా ఉంచకుండా తోటి సభ్యుల విూద చేయి చేసుకోవడం, తోసేయడం లాంటి చర్యలు పాల్పడ్డారని ఆమె మండిపడ్డారు.
బిల్లు ప్రతులను కాల్చడం అవమానించడమే : స్వామిగౌడ్
తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను సీమాంధ్ర ఎమ్మెల్యేలు చించి, కాల్చివేయడాన్ని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ తదితరులు మండిపడ్డారు. ఇలా చేయడం తమను అవమానించడమేనన్నారు. ఎన్నో ఏళ్లుగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాన పోరాటం జరుగుతోందని, ఎందరో అమాయకులు బలయ్యారని అన్నారు. ఇది గుర్తించకుండా బిల్లు ప్రతులను తగులబెట్టి దుర్మార్గ చర్యకు పాల్పడిన ఎమ్మెల్యేలు మూర్ఖులు అని విరుచుకుపడ్డారు. బిల్లు ప్రతులను చించిడం ఏంటని ప్రశ్నించారు. ఇది సంస్కారం ఉన్నచర్యేనా అని ప్రశ్నించారు. తెలంగాణపై అసెంబ్లీలో చర్చ ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణా ప్రజల చిరకాల వాంచ అయిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబందించిన బిల్లు అసెంబ్లీకి వచ్చి నప్పుడు హుందాగా వ్యవహరించాల్సింది పోయి దుర్మార్గంగా వ్యవహరిస్తున్న సీమాంద్ర టిడిపి, వైసిపి నేతలను ప్రజలుక్షమించరని గౌడ్ హెచ్చరించారు. కేవలం తమ ప్రాబల్యం కోసం వారు ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ఒడిగట్టారని అన్నారు. 60ఏల్ల సుదీర్ఘపోరాటాల ద్వారా వచ్చిన తెలంగాణా బిల్లు ప్రతులను చించడం, కాల్చి వేయడం వారి అవివేకాన్ని వెల్లడించిందన్నారు. కలసి ఉందామని ఇంతకాలం చెప్పిన వారు తమతోటి వారిపట్ల వారికి ఉన్న గౌరవం ఏపాటిదో అర్థం అయ్యిందన్నారు. బిల్లును చించేయడం, కాల్చేయడం ద్వారా రాజ్యాంగాన్ని, రాష్ట్రపతిని అగౌరవపరిచినట్లేనని హెచ్చరించారు. తెలంగాణా బిల్లును ప్రవేశపెట్టి అటు రాష్ట్రపతి ఆదేశాలను పాటించి, ఇటు తెలంగాణా ప్రజల మనోబావాలను గౌరవించిన వ్యక్తిగా స్పీకర్ నాదేండ్ల మనోహర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యాంగ ధర్మాన్ని స్పీకర్ కాపాడారని అన్నారు. ఇదే స్పీడ్‌లో చర్చను చేపట్టాలని కోరారు. టిడిపి, వైసిపిలు నేడు బిల్లును చించేసినా, కాల్చేసినా అదియావత్ రాజ్యాంగానే అవ మాన పరిచిందవుతుందన్నారు. ఆనాడు తెలంగాణాలో విజయమ్మ తిరుగుతున్నప్పుడు తెలంగాణా కోసం తన భర్త 41మంది ఎమ్మెల్యేలతో, సంతకాలు చేయించి పంపించారని గొప్పగా చెప్పుకున్నదంతా మొసలి కన్నీరేనని నేడు తేలిపోయిందన్నారు. టిఆర్‌ఎస్ ఏనాటి నుంచో చెపుతున్నట్లుగానే కిరణ్, జగన్, చంద్రబాబు లంతా సీమాంద్ర బాబులేనని నిరూపించుకున్నారని పేర్కొన్నారు. వీరంతా తెలంగాణపై విషం గక్కుతున్నారని చెప్పిందే నిజమైందన్నారు. పైకి కలసి ఉందామని చెప్పి ఇంతకాలం దోచుకున్నది చాలదా అని అన్నారు. ఇంతజరిగిన తర్వాత కూడా కలిసి ఉందామని వైసిపి, సీమాంద్ర టిడిపి నేతలు పేర్కొనడం దుర్మార్గమే అవుతుందన్నారు. విూడియా, తెలంగాణా ఎమ్మెల్యేలముందు బిల్లుప్రతులను చించడం అవమానంగానే తాము భావిస్తున్నామన్నారు. దీనికిత్వరలోనే ఆరెండు పార్టీలు గుణపాఠం నేర్చుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.. ఆయా పార్టీలు మేనిఫెస్టోలో పెట్టింది, లేఖలు రాసిన వాటిని కూడా అ గౌరవపరిచినట్లే అవుతుందన్నారు. ఇప్పటికైనా నిజాలు గ్రహించి వాస్తవాలతో ముందుకు రావాలన్నారు.





