Wednesday, 4 November 2026

మత తత్వానికి వ్యతిరేకంగా పోరాడుతా


లాలూప్రసాద్‌

రాంచీ, డిసెంబర్‌ 16 (జనంసాక్షి) :

మతతత్వ పార్టీలకు వ్యతిరేకంగా లౌకిక పార్టీలను ఏకం చేయనున్నట్టు బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌యాదవ్‌ ప్రకటించారు. మతతత్వ పార్టీలను అధికారంలోకి రాకుండా చేయడానికి ఎటువంటి త్యాగానికైనా సిద్ధమన్నారు. పరోక్షంగా ఆయన బిజెపిని ఉద్దేశించి మాట్లాడారు. లాలూ సోమవారం బెయిల్‌పై విడుదల అయ్యారు. ‘నరేంద్ర మోడీ లేదా మరో మోడీ అయినా ఎదుర్కొవడానికి నేను సిద్ధం’ అన్నారు. లౌకిక పార్టీలను ఏకం చేసేందుకు దేశమంతా పర్యటిస్తానని చెప్పారు. లోక్‌పాల్‌ బిల్లును అడ్డుకునేందుకు అన్నా హజారే లాంటి వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అరవింద్‌ కేజీవ్రాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎన్నికలకే పరిమితమైందని, ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రాలేకపోతోందని ఎద్దేవా చేశారు. బిర్సాముండా జైలు నుంచి బెయిల్‌పై ఆయన సోమవారం మధ్యాహ్నం విడుదలయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. గడ్డి స్కామ్‌లో ఆయన శిక్షకు గురై జైలుకు వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *