ఐక్యరాజ్య సమితికి బదిలీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 18 (జనంసాక్షి) :
అమెరికాలో భారత దౌత్యవేత్త దేవయాని కొర్బగాడే అరెస్టు, విచారణలో అమెరికా పోలీసులు అనుసరించిన వైఖరిపై భారత్ భగ్గుమంది. భారత ప్రభుత్వం కూడా ఈ చర్యను తీవ్రంగా పరిగణించి, చర్యలు చేపట్టింది. దౌత్యాధికారి పట్ల అనుసరించిన తీరుకు భారత్ క్షమాపణ డిమాండ్ చేస్తుండగా అమెరికా ఇప్పటివరకు ఈ విషయంలో ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు కానీ పరిస్థితులను సవిూక్షిస్తున్నామని పేర్కొంది. ప్రభుత్వంతో పాటు ప్రతిపక్షాలు ఈ చర్యను ముక్తకంఠంతో ఖండించాయి. ఇప్పటికే గట్టిగా నిరసన తెలిపి, అమెరికా కాంగ్రెస్ సభ్యులతో ¬ంమంత్రి తదితరులు సమావేశాలను రద్దు చేసుకున్నారు. అమెరికా పోలీసుల వ్యవహారం తీవ్రంగా గర్హించదగినదని ప్రధాని మన్మోహన్‌సింగ్ బుధవారం పేర్కొన్నారు. ఆమెను వెంటనే స్వదేశానికి గౌరవంగా తీసుకురావడం తమ ముందున్న ప్రధాన కర్తవ్యమని విదేశాంగ శాఖమంత్రి సల్మాన్ ఖుర్షీద్ పేర్కొన్నారు. రాజ్యసభలో దేవయాని కేసు విషయంపై సభ్యులంతా ముక్తకంఠంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీతారం ఏచూరి అమెరికా చర్యలను తీవ్రంగా ఖండించారు. గట్టిగా సమాధానం చెప్పాలన్నారు. దేవయాని కేసును క్రిమినల్ నుంచి సివిల్ విభాగానికి మార్చాలని భారత్ కోరుతోంది. భారత దౌత్యవేత్త పట్ల అమెరికా అనుసరించిన వైఖరి ఎవరికీ అంగీకారం కాదని కేంద్ర విదేశాంగమంత్రి సల్మాన్‌ఖుర్షీద్ అన్నారు. అమెరికా వైఖరికి తగురీతిలో సమాధానం చెప్పేందుకు మరిన్ని కఠినమైన చర్యలు చేపట్టాలని బిజెపి నేత యశ్వంత్‌సిన్హా డిమాండ్ చేశారు. భారత్‌లో అమెరికా రాయబారి నాన్సీపావెల్‌ను భారత విదేశాంగశాఖ అధికారులు పిలిపించి ఘటనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే భారత్ తీవ్రంగా స్పందించడంతో అమెరికా స్వరం మార్చినట్లే కన్పిస్తోంది. అక్కడ జరిగిన సంఘటనపై వేర్వేరు ప్రభుత్వ విభాగాలు ఒకరిమీద ఒకరు నిందారోపణల పర్వం మొదలుపెట్టాయి. స్టేట్ డిపార్ట్‌మెంట్ మార్షల్స్ విూదికి నెడుతోంటే, మార్షల్స్ మాత్రం స్టేట్ డిపార్ట్‌మెంట్ పత్యాధికారిని అరెస్టు చేసిందని, తర్వాత జరగాల్సిన పద్ధతుల్ని తాము అనుసరించామని అంటున్నారు. ఈ విషయంలో యూఎస్ ఇంటర్నేషనల్ ప్రొటోకాల్ అండ్ ఎర్రర్ ఆఫ్ జడ్జిమెంట్ పూర్తి వైఫల్యమని దేవయాని తరఫు న్యాయవాది పేర్కొన్నారు. భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తున్న భారతీయుల వివరాలు ఇవ్వాలని కేంద్రం అమెరికా దౌత్యకార్యాలయాన్ని ఆదేశించింది. భారత విమానాశ్రయాల్లో అమెరికా దౌత్యవర్గాలకు ఉన్న ప్రత్యేక సౌకర్యాలను రద్దుచేసేందుకు కేంద్రం చర్యలు ప్రారంభించింది. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ముందు వున్న ట్రాఫిక్ బారికేడ్లను తొలగించమని పోలీసు శాఖకు అదేశాలు జారీ చేసింది. భారత్‌లో పర్యటిస్తున్న అమెరికా చట్టసభ సభ్యుల బృందాన్ని కలుసుకునేందుకు లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, కేంద్ర ¬ంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, గుజరాత్ సీఎం నరేంద్రమోడీ నిరాకరించారు.
ఐరాసకు దేవయాని బదిలీ
అమెరికాలో అరెస్టయి అనంతరం విడుదలైన భారత దౌత్యవేత్త దేవయాని కోర్బగాడేను భారత విదేశాంగశాఖ బదిలీ చేసింది. ఆమెను న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి భారత శాశ్వత రాయబార కార్యాలయానికి బదిలీచేశారు. దీంతో ఆమెకు వయన్నా ఒప్పందం అనుసరించి దౌత్యవ్తేలకు ఉండే అన్ని రకాల భద్రత ఉంటుంది. అమెరికాలోని భారత దౌత్య కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఆమెను పనిమనిషి ఫిర్యాదు కారణంగా అరెస్టు చేయడంతో భారత్ తీవ్ర నిరసన వ్యక్తంచేసింది. అయితే ఆమె వీసా నిబంధనలు ఉల్లంఘించింనందుకు దౌత్యవేత్తలకు లభించే రక్షణ ఉండదని అమెరికా పేర్కొంది. దీంతో భారత్ ఆమెను ఐరాసకు బదిలీచేసింది. దీంతో ఆమెకు అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం దౌత్యవేత్తలకు లభించే అన్ని రకాల భద్రతా ఉంటుంది.




