Tuesday, 3 November 2026

రాష్ట్రపతికి ఘన స్వాగతం

హైదరాబాద్‌, డిసెంబర్‌ 19 (జనంసాక్షి) :
రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గురువారం సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్‌ నగరానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ నుంచి హైదరాబాద్‌ నగరానికి చేరుకున్న రాష్ట్రపతికి హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్‌ చక్రపాణి, నగర మేయర్‌ మాజిద్‌ హుస్సేన్‌, పలువురు రాష్ట్ర మంత్రులు ప్రణబ్‌ ముఖర్జీకి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి, అక్కడ నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ప్రణబ్‌ ముఖర్జీ చేరుకున్నారు. ఈ నెల 31 వతేదీ వరకూ రాష్ట్రపతి హైదరాబాద్‌ నగరంలోనే బస చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *