Tuesday, 3 November 2026

సీఎం కిరణ్‌కు బెస్ట్‌ గవర్నెన్స్‌ అవార్డు

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 20 (జనంసాక్షి) :
ఇండియాటుడే బెస్ట్‌ బిగెస్ట్‌ అవార్డును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అందుకున్నారు. శుక్రవారం ఉదయం పలు విభాగాల్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇండియాటుడే అవార్డులు ప్రకటించింది. అనేక ఇబ్బందులు ఉన్నా పాలనా పరంగా ముందంజలో ఉన్న పెద్ద రాష్ట్రం విభాగంలో ఆంధప్రదేశ్‌కు ఇండియాటుడే అవార్డు ప్రకటించింది. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జైరాం రమేష్‌ చేతుల విూదుగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అధికారుల సహాయసహకారాలతో విజయవంతంగా కొత్త పథకాలు అమలు చేస్తున్నామన్నారు. మొదట్లో శాంతిభద్రతల నెలకొల్పడం పెద్ద సవాలుగా మారిందని సీఎం తెలిపారు. పలు రాష్ట్రాలు కూడా ఈ అవార్డును అందుకున్నాయి. ఈ సందర్బంగా జైరాం రమేశ్‌ సిఎం కిరణ్‌ను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *