ప్రారంభించిన మంత్రి డీకే అరుణ
హైదరాబాద్, డిసెంబర్ 23 (జనంసాక్షి) :
ప్రభుత్వానికి, ప్రజల మధ్య వారధిగా పనిచేసే జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారులకు అధునాతన వాహనాలు అందజేస్తున్నట్లు సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి డీకే అరుణ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గల డీపీఆర్‌వో కార్యాలయాలకు ప్రత్యేక వాహనాలను సమకూర్చినట్టు ఆమె పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం మసాబ్‌టాంక్ సమీపంలోని ఐఅండ్‌పీిఆర్ కార్యాలయంలో నూతన కార్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23 డీపీఆర్ కార్యాలయాలకు ప్రత్యేక వాహనాలను సమకూర్చినట్టు వెల్లడించారు. అంతేగాక ఒక టాబ్లెట్ పీసీ, ఇంటర్నెట్ సౌకర్యం తదితర సదుపాయాలు కల్పించినట్టు తెలిపారు.
డీపీఆర్వోలకు అధునాతన వాహనాలు




