లైంగిక వేధింపుల న్యాయమూర్తి గంగూలీ
సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి లేఖ
కోల్‌కతా, డిసెంబర్ 23 (జనంసాక్షి) :
తన పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ న్యాయమూర్తి ఏకే గంగూలీ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూరన్తి సదాశివంకు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, న్యాయమూర్తిగా తాను ఇచ్చిన కొన్ని తీర్పులను జీర్ణించుకోలేకపోయిన కొందరు శక్తిమంతులు తన ప్రతిష్టను దిగజార్చడానికి కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు తనపట్ల సరిగా వ్యవహరించలేదని తెలిపారు. ఈమేరకు సీజేకు ఎనిమిది పేజీల లేఖ రాసినట్లు వెల్లడించారు. లేఖ ప్రతిని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పంపుతున్నట్లు చెప్పారు. కాగా తన వద్ద పనిచేసే న్యాయ విద్యార్థినిపై లైగింక వేధింపులకు పాల్పడినట్లు గంగూలీ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
నా పట్ల అన్యాయంగా వ్యవహరిస్తున్నారు




